Realme అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Realme 11 Pro Series 5G లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. రియల్ మి 11 ప్రో సిరీస్ 5G ని జూన్ 8వ తేది మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సిరీస్ ఫోన్లను #TheNextLeap హ్యాష్ ట్యాగ్ తో కంపెనీ టీజ్ చేస్తోంది. వాస్తవానికి, ఈ ఫోన్లను రియల్ మి ముందగా చైనాలో లాంచ్ చేసింది మరియు ఇప్పుడు ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్దవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme 11 Pro Series 5G
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది.ఈ ఫోన్లను ప్రీమియమ్ లీచీ లెథర్ ని ఇండస్ట్రీ ఫస్ట్ 3D ఓవెన్ టెక్స్చర్ తో తీసుకువస్తునట్లు చెబుతోంది. ఈ సిరీస్ నుండి Realme 11 Pro 5G మరియు 11 Pro+ 5G ఫోన్ ళ్లను లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్ మి టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ సిరీస్ లో రానున్న ఫోన్ యొక్క కెమేరా ని ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్ లో భారీ 200MP కెమేరాతో ఫోన్ ను తీసుకువస్తోంది.
జూన్ 1వ తేదీ అంటే రేపు మరొక కీ స్పెక్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ టీజర్ చెబుతోంది. అయితే, చైనాలో రియల్ మీ విడుదల చేసిన 11 Pro+ 5G ఫోన్ లో 200MP కెమేరా, Curved Display, Dinemsity 7050 చిప్ సెట్ 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ కెమేరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరి ఇండియాలో ఎటువంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు అడుగు పెడతాయో చూడాలి.