Poco X8 Pro 5G లాంచ్ డేట్ అండ్ టాప్ ఫీచర్స్ రివీల్ చేసిన పోకో.!

HIGHLIGHTS

Poco X8 Pro 5G అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసింది

ఈ ఫోన్ ఫీచర్స్ ను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో ఈ ఫోన్ పై అంచనాలు పెంచింది

100W ఫాస్ట్ ఛార్జ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది

Poco X8 Pro 5G అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ డేట్ మరియు టేప్ ఫీచర్స్ ను సైతం కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కంటే చాలా ముందుగా ఈ ఫోన్ ఫీచర్స్ ను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో ఈ ఫోన్ పై అంచనాలు పెంచింది. ఎందుకంటే, ఈ ఫోన్ 2.6 Mn కంటే అధిక AnTuTu స్కోర్ అందించే ఫాస్ట్ చిప్ సెట్, బిగ్ బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది.

Poco X8 Pro 5G లాంచ్ డేట్

పోకో ఎక్స్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చి 17వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు అదే రోజు పోకో ఎక్స్ 8 ప్రో ఐరన్ మ్యాన్ ఎడిషన్ ను కూడా లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ కోసం కూడా కంపెనీ టీజర్ విడుదల చేసింది .

Poco X8 Pro 5G : కీలక ఫీచర్స్

ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 4nm ఆర్కిటెక్చర్ ప్రోసెసర్ Dimensity 8500 Ultra తో లాంచ్ అవుతుంది. ఇది 2.3 మిలియన్ AnTuTu స్కోర్ తో హెవీ గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్‌ కోసం కూడా చాలా అనుకూలమైన చిప్ సెట్ గా చెప్పబడుతుంది. ఈ ఫోన్ LPPDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో టోటల్ 24GB హెవీ ర్యామ్ ఫీచర్ లభిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ గేమింగ్ సమయంలో వేగంగా పని చేయడానికి వీలుగా వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ గురించి కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లో 50MP (Sony IMX 882) మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఇందులో AI నైట్ మోడ్, మోషన్ క్యాప్చర్ మరియు 60FPS తో 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ కెమెరా ఆకర్షణీయమైన డైనమిక్ RGB లైట్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ గురించి పోకో గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది.ఈ ఫోన్ ను అత్యంత వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇది కాకుండా బైపాస్ ఛార్జ్, PPS ఛార్జింగ్ మరియు స్మార్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Also Read: Flipkart Sale భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Dolby Smart Tv లభిస్తోంది.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 3D ఐస్ లూప్ కూలింగ్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ HDR గేమింగ్ సపోర్ట్ అందించే మంచి స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ ను మంచి గేమింగ్ ఫోన్ గా పోకో విడుదల చేస్తున్నట్లు క్లియర్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ ప్రైస్ మార్కెట్ లో కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :