భారీ డిస్కౌంట్ కేవలం 5 వేల బడ్జెట్ లోనే ZEBRONICS 5.1 Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

ZEBRONICS 5.1 Soundbar ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లోనే ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది

5.1 ఛానల్ సెటప్ తో 300W పవర్‌ఫుల్ సరౌండ్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది

రీసెంట్ గా మార్కెట్లో విడుదలైన ZEBRONICS 5.1 Soundbar ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈరోజు ఈ సౌండ్ బార్ పై లభిస్తున్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంటే కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లోనే ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 300W పవర్‌ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు 5.1 ఛానల్ సెటప్ తో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.

ZEBRONICS 5.1 Soundbar : ఆఫర్

జెబ్రోనిక్స్ గత సంవత్సరం అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ Juke BAR 7600 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఆఫర్ ను అమెజాన్ ఇండియా అందించింది. ఈ సౌండ్ బార్ పై 76% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 6,699 ధరకే ఈరోజు ఆఫర్ చేస్తోంది. అలాగే, ఈ సౌండ్ బార్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా రూ. 669 (10%) రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,530 రూపాయల డిస్కౌంట్ ధరకే మీకు ఈరోజు లభిస్తుంది. Buy From Here

Also Read: OnePlus Nord Buds 4 Pro: పవర్ ఫుల్ బాస్ మరియు LHDC తో లాంచ్ అవుతోంది.!

ZEBRONICS 5.1 Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు లభిస్తున్న ఐదు వేల రూపాయల బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఎలాగంటే, ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ రియల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ఫుల్ బాక్స్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 300W సౌండ్ అందిస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మ్యూజిక్, న్యూస్, మూవీస్ మరియు స్పోర్ట్స్ నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. అయితే, ఇందులో Dolby లేదా DTS వంటి అదనపు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉండదు, ఇది పెద్ద లోటుగా ఉంటుంది. కానీ, ఈ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఇది కాకుండా ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ మల్టి కనెక్టివిటీ సెటప్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :