పోకో లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Poco X5 Pro మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. పోకో ఎక్స్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు Flipakrt నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, భారీ డిస్కౌంట్ అఫర్ తో ఈ పోకో లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జరగనున్నది. మరి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Poco X5 Pro: ధర మరియు ఆఫర్స్
పోకో ఎక్స్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను క్రింద చూడవచ్చు.
ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipakrt నుండి ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ లాంచ్ అఫర్ కూడా వుంది.ICICI బ్యాంక్ కార్డ్స్ అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి 2,000 తగ్గింపు లభిస్తుంది.
Poco X5 Pro: స్పెక్స్
పోకో X5 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. ఈ డిస్ప్లే Dolby Vision కి సపోర్ట్ చేస్తుంది మరియు 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 108MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రెంట్ కెమేరా వుంది.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత MIUI 14 సాఫ్ట్ వేర్ పైన ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. ఈ ఫోన్ 67W సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile