పోకో ఈరోజు ఇండియాలో మరొక కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, Poco X5 5G స్మార్ట్ ఫోన్ మరియు ఇది స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చెయ్యబడింది. కేవలం ఇది మాత్రమే కాదు, బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు మరిన్ని ఫీచర్ల పైన ఒక లుక్ వేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Poco X5 5G: ధర మరియు సేల్
పోకో ఎక్స్5 5G స్మార్ట్ ఫోన్ ముదురు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను క్రింద చూడవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipakrt సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 2,000 తగ్గింపు అఫర్ ను అందించింది.
Poco X5 5G: స్పెక్స్
పోకో X5 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 13ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సేఫ్టీతో వస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 48MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ కెమేరా మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా IP53 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile