Poco X4 Pro 5G: లీకైన పోకో అప్ కమింగ్ ఫోన్ Live ఇమేజిలు
లీకైన Poco X4 Pro 5G లైవ్ ఇమేజిలు
ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమెరా బంప్ లో 108MP కెమెరా మార్క్
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ AMLOED స్క్రీన్
లీకైన Poco X4 Pro 5G లైవ్ ఇమేజిలను చూస్తుంటే, అతి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. Smartdroid అనే జర్మన్ వెబ్‌సైట్ పోకో X4 ప్రో 5G యొక్క ఆరోపిత లైవ్ ఇమేజిలను షేర్ చేసింది. అయితే, ఇప్పుడు ఆ వెబ్సైట్ ఈ ఇమేజిలను తొలగించబడినట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్ లో ఫోన్ మరియు ఫోన్ బాక్స్ రెండింటిని కూడా చూపించింది.
Surveyఈ ఇమేజిల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమెరా బంప్ లో 108MP కెమెరా మార్క్ ను చూపించింది. అంతేకాదు, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ AMLOED స్క్రీన్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6nm ఫ్యాబ్రిక్-బేస్డ్ స్నాప్‌డ్రాగన్ 5G చిప్‌సెట్ మరియు MIUI 13 సాఫ్ట్‌వేర్ వంటి ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు వెల్లడించబడ్డాయి. ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజస్ లో చాలా క్లియర్ గా ఈ ఫీచర్లు కనిపిస్తున్నాయి. ఈ లీకైన స్పెక్స్ ఆధారంగా పూర్తి అంచనా స్పెక్స్ ను కూడా ఊహిస్తున్నారు. ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ ఈ క్రింద చూడవచ్చు.
Poco X4 Pro 5G: అంచనా స్పెక్స్
పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను అందించవచ్చు. ఇక లీకైన ఇమేజీలు ప్రకారం వెనుక భాగంలో 108MP మైన్ కెమెరా ఉంటుంది. దీనికి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉండవచ్చని రూమర్.
ఇక ఫోన్ ఇన్ సైడ్ లో, ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే కొత్త లీక్ ప్రకారం, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 అవుతుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.