పోకో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను ప్రకటించింది. పోకో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేసిన ట్వీట్ ద్వారా Poco X4 Pro మరియు M4 Pro 4G లను ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే అదేరోజున MWC 2022 కూడా మొదలవుతుంది. పోకో యొక్క ఈ గ్లోబల్ ఈవెంట్ 20:00 GMT+8 కి ప్రారంభం కానుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఇటీవలే, Poco X4 Pro యొక్క లైవ్ ఇమేజీలు ఆన్లైన్ లో లీకయ్యాయి. అయితే, కొద్దీ సేపటికే ఈ లైవ్ ఇమేజీలు తొలగించబడ్డాయి. ఆ లైవ్ ఇమేజీలు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెక్స్ బయటపెట్టాయి. Poco X4 Pro యొక్క అంచనా స్పెక్స్ ఈ క్రింద చూడవచ్చు.
పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను అందించవచ్చు. వెనుక భాగంలో 108MP మైన్ కెమెరా ఉంటుంది. దీనికి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉండవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే కొత్త లీక్ ప్రకారం, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 అవుతుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.