Poco M8 Power : భారీ 8000 mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!

HIGHLIGHTS

పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్ కూడా కన్ఫర్మ్ చేసింది

భారీ 8000 mAh బ్యాటరీతో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది

పోకో ఎం 8 పవర్ స్మార్ట్ ఫోన్ డిజైన్, బ్యాటరీ మరియు స్క్రీన్ వివరాలు కంపెనీ రివీల్ చేసింది

Poco M8 Power : భారీ 8000 mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!

Poco M8 Power : పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్ కూడా కన్ఫర్మ్ చేసింది. పోకో ఎం సిరీస్ నుంచి ఇప్పటికే మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందించిన పోకో, ఇప్పుడు భారీ బ్యాటరీతో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను సరికొత్త ప్రీమియం డిజైన్, గేమింగ్ మరియు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం తగిన బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M8 Power : లాంచ్ డేట్

పోకో ఎం 8 పవర్ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో లాంచ్ అవుతోంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా అఫీషియల్ గా ఫ్లిప్ కార్ట్ ద్వారా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Poco M8 Power : కీలక ఫీచర్స్

పోకో ఎం 8 పవర్ స్మార్ట్ ఫోన్ డిజైన్, బ్యాటరీ మరియు స్క్రీన్ వివరాలు కంపెనీ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఐఫోన్ ను పోలిన డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. కలర్ కూడా కొత్త ఆరంజ్ కలర్ లో ఉన్నట్లు మనం చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ కలిగి ఉండటంతో కొంచెం మందంగా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

Poco M8 Power

ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను 8000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు పోకో తెలిపింది. ఇది దాదాపు 3 రోజల బ్యాకప్ అందించే శక్తి ఈ బ్యాటరీకి ఉన్నట్లు కంపెనీ టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లో ఉన్న బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ అందించే అవకాశం ఉంది.

మంచి విజువల్స్ కోసం ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో AMOLED స్క్రీన్ ను అందిస్తున్నట్లు కూడా పోకో కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా రివీల్ చేసింది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. ఈ వివరాలు కంపెనీ అందించిన టీజర్ ద్వారా స్పష్టం చేసింది.

Also Read : Smartphone ధరలు అమాంతం పెరగడానికి రీజన్ ఇదేనంట బ్రో.!

పోకో ఎం 8 పవర్ : అంచనా ఫీచర్స్

పోకో ఎం 8 పవర్ వచ్చిన అనేక లీక్స్ ద్వారా మార్కెట్ వర్గాలు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ అందించాయి. లీక్స్ ప్రకారం, ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6.9 అంగుళాల బిగ్ 120Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 4 Gen 4 ప్రాసెసర్ తో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇవి లీక్స్ ద్వారా అందించిన అంచనా ఫీచర్స్ మాత్రమే అని గమనించాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile