Poco M7 5G: 12GB ర్యామ్ మరియు స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
Poco M7 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోంది
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా పోకో రివీల్ చేసింది
12GB ర్యామ్ మరియు స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది
Poco M7 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా పోకో రివీల్ చేసింది. ఈ ఫోన్ ను 12GB ర్యామ్ మరియు స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ తో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.
SurveyPoco M7 5G: లాంచ్
పోకో M7 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 3వ తేదీ 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించిన టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా ఈ పేజీ ద్వారా రివీల్ చేసింది.
Poco M7 5G: ఫీచర్స్
పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ M7 5జి స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా సెటప్ ఉంటుంది మంచి డిజైన్ తో కనిపిస్తుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ 450K కి పైగా AnTuTu స్కోర్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 12GB వరకు ర్యామ్ ఫీచర్ ని కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే, 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB టర్బో ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది.

పోకో M7 5జి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మరియు కెమెరా వివరాలు కూడా పోకో టీజర్ ద్వారా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో పెద్ద 6.88 ఇంచ్ స్క్రీన్ కలిగిన ఫోన్ అవుతుందట. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఐ సేఫ్ డిస్ప్లే మరియు తక్కువ బ్లూ లైట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 150% పెద్ద సౌండ్ అందించే స్పీకర్ ను కలిగి ఉంటుంది.
Also Read: Maha Shivaratri Deal: LG పవర్ ఫుల్ సౌండ్ బార్ పై లిమిటెడ్ ఆఫర్ అందుకోండి.!
అంచనా ధర:
పోకో ఈ ఫోన్ ను 10 వేల కంటే తక్కువ ధరలో అందించే అవకాశం ఉంటుంది.