Poco M4 Pro 5G: ఇండియాలో విడుదలకు సిద్దమవుతున్న పోకో స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

POCO M4 Pro 5G ఇండియాలో విడుదలవుతోంది

ఫిబ్రవరి 15న విడుదల చేస్తున్నట్లు పోకో ప్రకటించింది

POCO M4 Pro 5G ఫీచర్లు

Poco M4 Pro 5G: ఇండియాలో విడుదలకు సిద్దమవుతున్న పోకో స్మార్ట్ ఫోన్

POCO M4 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఫిబ్రవరి 15న విడుదల చేస్తున్నట్లు పోకో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం గ్లోబల్ మార్కెట్లో విడుదల చెయ్యబడింది. అయితే, ఇప్పుడు ఇండియాలో ఈ ఫోన్ విడుదకు సిద్దమవుతోంది. ఈ ఫోన్ ను యూరేపియన్ మార్కెట్లో మీడియాటెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ మరియు మరిన్ని బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. Poco M4 Pro 5G ఇండియన్ వేరియంట్ యొక్క వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ యొక్క యూరేపియన్ వేరియంట్ యొక్క స్పెక్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలను క్రిందచూడవచ్చు.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO M4 Pro 5G: స్పెక్స్ (Global)

ఈ POCO M4 Pro 5G ఫోన్ 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.

పోకో ఎం4 ప్రో 5G  వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.

POCO M4 Pro 5G: ధర (Global)

యూరప్ లో POCO M4 Pro 5G బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 229 (సుమారు రూ. 19,600) ధరతో వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 249 (సుమారు రూ. 21,400) ధరతో వచ్చింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు పోకో ఎల్లో అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo