POCO C85x 5G: పోకో ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యింది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోను విడుదల చేసిన ప్రైస్ సెగ్మెంట్లో ఊహించని పీక్ స్పెక్స్ ఈ ఫోన్ ను అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో యొక్క లేటెస్ట్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టింది.
పోకో ఈ ఫోన్ ను కేవలం రూ. 10,999 రూపాయల అతి తక్కువ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బేసిక్ 4 జీబీ + 64 జీబీ ను ఈ ప్రైస్ తో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను కూడా కేవలం రూ. 11,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు గ్రీన్ యూదు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో ధరలో పెద్ద 6.9 ఇంచ్ HD+ డిస్ప్లే తో విడుదలైన 5జి ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 HBM బ్రైట్నెస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.95mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 5G చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది 6 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్. ఈ ఫోన్ లో 4జీబీ ఫిజికల్ ర్యామ్, 4జీబీ అదనపు ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ లో వెనుక 32MP ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 6300 mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 7.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది.
Also Read: Boat 5.1 Dolby Soundbar అమెజాన్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ తో నెవర్ బిఫోర్ ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ లో గొప్ప సౌండ్ అందించే 200% వాల్యూమ్ స్పీకర్ సెటప్ కూడా అందించింది. ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ ఫీచర్స్ చూస్తుంటే, బడ్జెట్ ధరలో బిగ్ సర్ప్రైజ్ గా లాంచ్ అయ్యిందని అనిపిస్తుంది.