POCO X8 Pro Series నుంచి రెండు కొత్త ఫోన్లు ఫోన్స్ ప్రకటించిన కంపెనీ.!

HIGHLIGHTS

POCO X8 Pro Series ఇండియాలో విడుదల చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది

ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతున్నట్లు కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది

ఈ రెండు ఫోన్లు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అందిస్తాయని కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది

POCO X8 Pro Series ఇండియాలో విడుదల చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతున్నట్లు కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క డిజైన్ మరియు వివరాలు వెల్లడించే టీజర్ పోస్టులు కూడా కంపెనీ తన అఫీషియల్ X అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అందిస్తాయని కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది.

POCO X8 Pro Series : ఇండియా లాంచ్ డేట్?

పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో మార్చి 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది. ఈ ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఫోన్లుగా విడుదల చేయబోతున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సెల్ కి అందుబాటులోకి వస్తాయి.

POCO X8 Pro Series : రెండు ఫోన్లు ఏమిటి?

పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ నుంచి ఎక్స్ 8 ప్రో మరియు ఎక్స్ 8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. వీటిలో ఎక్స్ 8 ప్రో మంచి కాంపాక్ట్ డిజైన్ తో మరియు ఎక్స్ 8 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ పెద్ద సైజులో ఉంటుంది.

Also Read: Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి Kodak Smart Tv లపై జబర్దస్త్ డిస్కౌంట్ అందించింది.!

పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ : ఫీచర్స్ ఏమిటి?

ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతల గురించి కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లలో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో పవర్ పవర్ ఫుల్ కెమెరాలు ఉంటాయని మాత్రమే కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ గురించి వచ్చిన కొన్ని లీక్స్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు వెల్లడించాయి.

లీక్స్ ప్రకారం, ఈ సిరీస్ ప్రీమియం ఫోన్ ఎక్స్ 8 ప్రో మాక్స్ మీడియాటెక్ Dimensity 9500s లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎక్స్ 8 ప్రో ఫోన్ ను మాత్రం Dimensity 8500 Ultra చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా కెమెరా పై ప్రత్యేకమైన LED లైట్ మరియు డ్యూయల్ ఫ్లాష్ సెటప్ కలిగి ఉంటుందని కూడా లీక్స్ చెబుతున్నాయి.

వీటిలో, మాక్స్ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ కలిగి ఉంటే, ఎక్స్ 8 ప్రో మోడల్ మాత్రం 6.59 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్ల డిస్ప్లే లు కూడా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు కూడా బిగ్ బ్యాటరీ సెటప్ కూడా కలిగి ఉంటాయని చెబుతున్నారు.

కంపెనీ టీజర్ లో భాగంగా త్వరలోనే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :