WhatsApp Web calling: వాట్సాప్ వెబ్ లో వాయిస్ అండ్ వీడియో కాల్ ఫీచర్ వచ్చేసింది.!

HIGHLIGHTS

ఇప్పటి వరకు వాట్సాప్ వెబ్ తో కేవలం చాటింగ్ కోసం మాత్రమే అవకాశం ఉంది

వాట్సాప్ వెబ్ నుంచే నేరుగా బ్రౌజర్‌ లోవాయిస్ కాల్ మరియు వీడియో కాలింగ్ చేసే అవకాశం

ప్రత్యేకమైన యాప్ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ వెబ్ లో కాలింగ్ ఫీచర్ అందించింది

WhatsApp Web calling: ఇప్పటి వరకు కంప్యూటర్‌ లో వాట్సాప్ వెబ్ తో కేవలం చాటింగ్ కోసం మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ వాయిస్ లేదా వీడియో కాల్ చేయాలంటే Windows లేదా macOS కోసం ప్రత్యేకమైనవాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌ ను కచ్చితంగా ఉపయోగించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు Meta ఈ హద్దులు తొలగించి వాట్సాప్ వెబ్ నుంచే నేరుగా బ్రౌజర్‌ లోవాయిస్ కాల్ మరియు వీడియో కాలింగ్ చేసే అవకాశం అందించింది.

WhatsApp Web calling: అంటే ఏమిటి?

స్మార్ట్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ని ఉపయోగించడం మనం సర్వ సాధారణంగా రోజు చూసే విషయమే. అయితే, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో పని చేసేటప్పుడు ఫోన్ లో వాట్సాప్ చూసే అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ ను ఉపయోగిస్తారు. అయితే, ఇందులో కేవలం చాటింగ్ కోసం మాత్రమే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేకమైన వాట్సాప్ వెబ్ యాప్ ఉపయోగించాలి. అయితే, ఇప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన యాప్ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ వెబ్ లో కాలింగ్ ఫీచర్ అందించింది.

వాట్సాప్ వెబ్ కాలింగ్ అనేది Chrome, Edge, Safari వంటి సపోర్ట్ ఉన్న వెబ్ బ్రౌజర్‌ లో వాట్సాప్ తో లాగిన్ అయ్యి ఆడియో లేదా వీడియో కాల్స్ చేయగలిగే ఫీచర్. దీనికి ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ వెబ్ లో చేసే వాయిస్ అండ్ వీడియో కాల్స్ కూడా వాట్సాప్ లో ఉండే End-to-End ఎన్క్రిప్షన్ తో సురక్షితంగా ఉంటాయి.

WhatsApp Web calling చేయడం ఎలా?

  • కంప్యూటర్‌ లో వాట్సాప్ వెబ్ ను ఓపెన్ చేయండి.
  • మీ వాట్సాప్ ఖాతాను QR కోడ్ తో స్కాన్ చేసి లింక్ చేయండి.
  • కాల్ చేయాలనుకున్న వ్యక్తి చాట్‌ ను ఓపెన్ చేయండి.
  • చాట్ ఎగువ భాగంలో కనిపించే Phone లేదా Video ఐకాన్‌ పై క్లిక్ చేయండి.
  • మొదటిసారి బ్రౌజర్ లో కాలింగ్ కోసం కెమెరా మరియు మైక్రోఫోన్ అనుమతి అడిగితే Allow చేయండి.
  • అంతే, వెంటనే Voice లేదా Video Call ప్రారంభమవుతుంది

మీరు వెబ్ బ్రౌజర్ లో మంచి క్వాలిటీ కాలింగ్ కూడా పొందొచ్చు. దీనికోసం స్థిరమైన Wi-Fi లేదా హైస్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించండి. నాణ్యమైన మైక్రోఫోన్ లేదా హెడ్‌సెట్ వాడితే మరింత స్పష్టమైన కాలింగ్ మీకు లభిస్తుంది. మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో ఉండే వెబ్‌ క్యామ్‌ ను క్లీన్ గా ఉంచుకోండి. అలాగే, మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ లో కెమెరా మరియు మైక్రో ఫోన్ అనుమతులు బ్రౌజర్‌ లో యాక్టివ్‌గా ఉన్నాయో లేదో చూడండి.

Also Read : OnePlus N6x : బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ కొత్త ఫీచర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే,వాట్సాప్ వెబ్ లో కాలింగ్ ఫీచర్ రావడంతో కంప్యూటర్ నుంచే సులభంగా వాయిస్ అండ్ వీడియో కాల్స్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :