Poco C85x 5G: రేపు లాంచ్ అయ్యే పోకో బడ్జెట్ ఫోన్ కంప్లీట్ వివరాలుముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

పోకో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోకో సి85x

బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ లో 6300mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది

Poco C85x 5G: ఇండియన్ మార్కెట్లో పోకో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోకో సి85x స్మార్ట్ ఫోన్ కంప్లీట్ వివరాలు ఒకరోజు ముందుగా చూడనున్నాము. ఈ స్మార్ట్ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు బిగ్ డిస్ప్లే వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి పోకో సిద్దమయింది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది అయితే మనం ఈ రోజే ఈ ఫోన్ యొక్క కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం.

Poco C85x 5G : లాంచ్

ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Poco C85x 5G : ఫీచర్స్

పోకో సి 85x స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ లో డ్యూయల్ టోన్ కలర్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో అతిపెద్ద 6.9 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ డిస్ప్లే గొప్ప గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కు బాగా ఉంటుందని పోకో చెబుతోంది. అంతేకాదు, కళ్ళకు హాని కలిగించని TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్, 4జీబీ ఫిజికల్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు వేగవంతమైన UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 32MP మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ముంచు వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6300mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. గత జనరేషన్ ఫోన్ కంటే 300 mah అధిక శక్తి కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీతో 35 గంటల కంటే ఎక్కువ గంటల వీడియో ప్లే బ్యాక్ ఇస్తుంది. ఈ ఫోన్ లో 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Sony BRAVIA లేటెస్ట్ బిగ్ Smart Tv అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది.!

ఈ ఫోన్ అదనపు ఫీచర్లు విషయానికి వస్తే, ఇందులో గొప్ప సౌండ్ కోసం 200% వాల్యూమ్ అందించే స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. అంటే, ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ 5జి ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతున్నట్లు పోకో అందించిన టీజర్ పేజీ తెలియ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :