POCO C81 మరియు C81X లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ సేల్ స్టార్ట్ అయ్యింది.!

HIGHLIGHTS

POCO C81 మరియు C81X ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా భారీ బ్యాటరీ మరియు గొప్ప డిజైన్ తో కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యాయి

రెండు ఫోన్లు కూడా 13MP AI రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తాయి

పోకో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు POCO C81 మరియు C81X ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా భారీ బ్యాటరీ మరియు గొప్ప డిజైన్ తో కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లు సేల్ కోసం ఎదురు చూస్తున్న యూజర్లు ఈరోజు నుంచి ఈ ఫోన్ ను అందుకోవచ్చు. ఈ సేల్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.

POCO C81 మరియు C81X: ధర

ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ చూస్తే, పోకో సి 81x ఫోన్ (3 జీబీ + 64 జీబీ) ను కేవలం రూ. 9,999 ధరతో అందించింది. ఇక పోకో సి 81 స్మార్ట్ ఫోన్ ను కూడా (4 జీబీ + 64 జీబీ) ఒకే వేరియంట్ లో కేవలం రూ. 10,999 ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా సింగల్ వేరియంట్ లో మాత్రమే లభిస్తాయి.

ఈ ఫోన్ పై మంచి లాంచ్ ఆఫర్స్ కూడా పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతాయి. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: లేటెస్ట్ GOVO 5.2.4 True Dolby Atmos బడ్జెట్ సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!

POCO C81 మరియు C81X: ఫీచర్స్

ఈ రెండు ఫోన్లు చిన్న చిన్న తేడాలు తప్పించి, ఒకే విధమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. వీటిలో పోకో సి 81x ఫోన్ 6.88 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటే, పోకో సి 81 మాత్రం 6.9 ఇంచ్ డిస్ప్లే తో లాంచ్ వస్తుంది. అయితే, రెండు ఫోన్లు కూడా HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ రెండు లేటెస్ట్ ఫోన్లు కూడా UNISOC T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. కానీ, C81x ఫోన్ 3GB ర్యామ్ కలిగి ఉంటే, C81 మాత్రం 4GB ర్యామ్ కలిగి ఉంటుంది. అయితే, రెండు ఫోన్లు కూడా 64GB స్టోరేజ్ కలిగి ఉంటాయి.

కెమెరా సెటప్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా 13MP AI రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తాయి. అయితే, ఈ ఫోన్లు AI కెమెరా ఫీచర్స్ మరియు పోకో కెమెరా ఫిల్టర్లు కలిగి ఉంటాయి. పోకో C81 ఫోన్ 6300 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అయితే, పోకో C81x మాత్రం 5200 mAh బ్యాటరీ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ, ఈ రెండు కొత్త ఫోన్లు కూడా 15W ఫాస్ట్ ఛార్జ్ కలిగి ఉంటాయి. అంతేకాదు, 7.5W రివర్స్ ఛార్జ్ ఫీచర్స్ ను కూడా ఈ రెండు ఫోన్లు కలిగి ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :