లేటెస్ట్ GOVO 5.2.4 True Dolby Atmos బడ్జెట్ సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

గోవో గత వారం కొత్త GOVO 5.2.4 True Dolby Atmos బడ్జెట్ సౌండ్ బార్ ని విడుదల చేసింది

ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లు అనౌన్స్ చేసింది

ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 800W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది

లేటెస్ట్ GOVO 5.2.4 True Dolby Atmos బడ్జెట్ సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!

బడ్జెట్ సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్న గోవో గత వారం కొత్త GOVO 5.2.4 True Dolby Atmos బడ్జెట్ సౌండ్ బార్ ని విడుదల చేసింది. ఈ సౌండ్ బీర్ పై ఈరోజు అమెజాన్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లు అనౌన్స్ చేసింది. సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఈ ఫీచర్స్ తో వచ్చిన ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

GOVO 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్

గోవో లేటెస్ట్ గా GoSurround 1000 Pro సౌండ్ బార్ ను 5.2.4 సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ను ఇండియాలో రూ. 23,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేయగా, ఈరోజు అమెజాన్ ఇండియా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ అందించి రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

GOVO 5.2.4 True Dolby Atmos soundbar

ఈ రెగ్యులర్ డిస్కౌంట్ తో పటు ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుండి SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: HMD Vibe 2 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించింది.!

GOVO 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

గోవో ఈ సౌండ్ బార్ ను న్యూ అండ్ ప్రీమియం లుక్ తో అందించింది. ఇది ఇంట్లో గొప్ప ఆకర్షణగా నిలిచే డెకరేషన్ ఐటమ్ గా కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను 5.2.4 ఛానల్ సెటప్ తో అందించింది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ఒక బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ బార్ లో ఎదురు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 800W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

ఇక ఈ గోవో సౌండ్ బార్ కలిగిన సౌండ్ సపోర్ట్ విషయానికి వస్తే, ఇది 5.2.4 ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలాజి తో సినిమా థియేటర్ వంటి మంచి సౌండ్ అందిస్తుందని గోవో తెలిపింది. కనెక్టివిటీ పరంగా, ఇందులో ఆప్టికల్, AUX, HDMI Arc, USB, మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఇంటిగ్రేటెడ్ టచ్ కంట్రోల్స్ మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo