Poco C75 5G స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు Sony కెమెరాతో లాంచ్ చేస్తోంది.!
Poco C75 5G మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్టు పోకో ప్రకటించింది
న్నింగ్ డిజైన్ మరియు Sony కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది
పోకో C75 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 17న భారత్ మార్కెట్లో లాంచ్ అవుతుంది
Poco C75 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్టు పోకో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు Sony కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ యొక్క లాంచ్ గురించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyPoco C75 5G : లాంచ్ డేట్
పోకో C75 5జి స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 17న భారత్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించింది మరియు ఈ పేజీ నుండి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ కూడా చేస్తోంది.
Poco C75 5G : ఫీచర్స్
ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీప్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ ను స్పష్టం చేసింది. ఈ ఇమేజి ద్వారా ఈ ఫోన్ సరికొత్త మార్బుల్ డిజైన్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో కనిపిస్తోంది. ఈ C75 5జి ఫోన్ రౌండ్ కార్నర్ మరియు సన్నని అంచులు కలిగిన కలిగిన డిజైన్ తో ఉన్నట్లు అర్ధం అవుతోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో తీసుకువస్తున్నట్లు పోకో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ 4nm ప్రోసెసర్ కి జతగా 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 4GB Turbo RAM సపోర్ట్ తో కూడా అందిస్తుందని పోకో తెలిపింది. ఈ ఫోన్ లో 2+1 కార్డ్ స్లాట్ ఉన్నట్లు కూడా పోకో వెల్లడించింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పోకో ఫోన్ లో Sony కెమెరా ఉందని పోకో తెలిపింది.
పోకో C Series అనేది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కాబట్టి, ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో (అండర్ 10K) లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.