Oppo Reno16c 5G price offers and features know here
Oppo Reno16c 5G: ఒప్పో రెనో సిరీస్ నుంచి ఈరోజు ఈ కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, మరింత శక్తివంతమైన బ్యాటరీ మరియు 5G కనెక్టివిటీతో అందించింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ ఒప్పో న్యూ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
ఒప్పో ఈ కొత్త ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లో అందించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ స్టారీ వైట్, స్టెల్లార్ పర్పల్ మరియు ట్విలైట్ వయొలెట్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ వంటి మరిన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read: Moto G77 Power : 7000 mAh భారీ బ్యాటరీతో మరో పవర్ ఫోన్ రిలీజ్ కు రెడీ అయ్యింది.!
ఒప్పో ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ AMOLED డిస్‌ప్లే అందించింది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ తో వస్తుంది. ఇది వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం మరియు సోషల్ మీడియా వినియోగం కోసం మరింత స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో అందించింది మరియు ఈ ఫోన్ లో గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఉంటాయి.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (3.5x ఆప్టికల్ జూమ్) కలిగిన ట్రిపుల్ రియర్ కుమార్ ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ అండ్ జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ ఎం మరియు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ IP69K బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.