Moto G77 Power : 7000 mAh భారీ బ్యాటరీతో మరో పవర్ ఫోన్ రిలీజ్ కు రెడీ అయ్యింది.!
మోటరోలా పవర్ సిరీస్ అంటేనే బ్యాటరీ ప్రత్యేకమైన ఫోన్ గా ప్రసిద్ధి చెందింది
మోటోరోలా కొత్తగా మోటో జి 77 పవర్ ఫోన్ ను 7000 mAh భారీ బ్యాటరీతో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా మోటోరోలా రివీల్ చేసింది
Moto G77 Power : మోటరోలా పవర్ సిరీస్ అంటేనే బ్యాటరీ ప్రత్యేకమైన ఫోన్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు పవర్ సిరీస్ నుంచి అందించిన అన్ని ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. ఇదే ఒరవడితో ఇప్పుడు మోటోరోలా కొత్తగా మోటో జి 77 పవర్ ఫోన్ ను 7000 mAh భారీ బ్యాటరీతో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది.
SurveyMoto G77 Power : రిలీజ్ డేట్
మోటో జి 77 పవర్ స్మార్ట్ ఫోన్ ను జూలై 8న ఇండియాలో లాంచ్ చేసున్నట్లు మోటోరోలా ఈ ఫోన్ లాంచ్ డేట్ రివీల్ చేసింది. యదావిదిగా ఈ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ అవుతుంది మరియు సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Moto G77 Power : ఫీచర్స్
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా మోటోరోలా రివీల్ చేసింది. ఈ ఫోన్ మంచి దృడమైన MIL-STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగిన 6.72 ఇంచ్ బిగ్ FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది స్మూత్ విజువల్స్ అందించే విధంగా ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ ను కూడా వెనుక ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ తో అందించింది.

ఈ అప్ కమింగ్ మోటో ఫోన్ కెమెరా వివరాలు కూడా మోటోరోలా వెల్లడించింది. మోటో జి 77 పవర్ స్మార్ట్ ఫోన్ 50MP Sony LYT 600 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా జతగా మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో ప్రో గ్రేడ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
ఈ ఫోన్ ఇక మెయిన్ ఫీచర్ అయిన బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ నార్మల్ యూసేజ్ పై 3 రోజుల బ్యాకప్ ఆఫర్ చేస్తుందని మోటోరోలా చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది మరియు ఆండ్రాయిడ్ 17OS కి అప్‌గ్రేడ్ అవుతుంది.
Also Read: Oppo Reno 16: ఈరోజు విడుదలైన ఒప్పో పవర్ ఫుల్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఇక ఈ ఫోన్ కలిగిన ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ Dolby Amtos మరియు Hi Res Audio సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా మోటోరోలా యొక్క స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ తో లాంచ్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
