Oppo Reno16c 5G: ఒప్పో న్యూ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

ఒప్పో రెనో సిరీస్ నుంచి ఈరోజు ఈ కొత్త ఫోన్ ను విడుదల చేసింది

AI ఆధారిత కెమెరా ఫీచర్లు మరియు మరింత శక్తివంతమైన బ్యాటరీతో అందించింది

ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది

Oppo Reno16c 5G: ఒప్పో న్యూ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

Oppo Reno16c 5G: ఒప్పో రెనో సిరీస్ నుంచి ఈరోజు ఈ కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, మరింత శక్తివంతమైన బ్యాటరీ మరియు 5G కనెక్టివిటీతో అందించింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ ఒప్పో న్యూ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Reno16c 5G: ప్రైస్

ఒప్పో ఈ కొత్త ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లో అందించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

  • ఒప్పో రెనో 16C (8GB + 128GB) ప్రైస్ : రూ. 46,999
  • ఒప్పో రెనో 16C (8GB + 256GB) ప్రైస్ : రూ. 49,999
  • ఒప్పో రెనో 16C (12GB + 256GB) ప్రైస్ : రూ. 55,999

ఈ ఫోన్ స్టారీ వైట్, స్టెల్లార్ పర్పల్ మరియు ట్విలైట్ వయొలెట్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ వంటి మరిన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

Also Read: Moto G77 Power : 7000 mAh భారీ బ్యాటరీతో మరో పవర్ ఫోన్ రిలీజ్ కు రెడీ అయ్యింది.!

Oppo Reno16c 5G: ఫీచర్స్

ఒప్పో ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ AMOLED డిస్‌ప్లే అందించింది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ తో వస్తుంది. ఇది వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం మరియు సోషల్ మీడియా వినియోగం కోసం మరింత స్మూత్‌ గా ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో అందించింది మరియు ఈ ఫోన్ లో గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఉంటాయి.

Oppo Reno16c 5G price and offers

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (3.5x ఆప్టికల్ జూమ్) కలిగిన ట్రిపుల్ రియర్ కుమార్ ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ అండ్ జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ ఎం మరియు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ IP69K బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile