Oppo Reno 14 Pro 5G ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Oppo Reno 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఒప్పో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఒప్పో రెనో 14 సిరీస్ ప్రీమియం వేరియంట్ గా ఈ ఫోన్ ఇండియాలో అడుగుపెట్టింది
ఈ ఫోన్ ను ఏరోస్పేస్ గ్రేడ్ అల్యుమినియం ఫ్రేమ్ తో ఈ ఫోన్ ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది
Oppo Reno 14 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఒప్పో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో రెనో 14 సిరీస్ 5జి ప్రీమియం వేరియంట్ గా ఈ ఫోన్ ఇండియాలో అడుగుపెట్టింది. ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో భారత మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఏక ఉన్నాయో తెలుసుకుందామా.
SurveyOppo Reno 14 Pro 5G : ఫీచర్స్
ఒప్పో రెనో 14 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఒప్పో వెల్వెట్ గ్లాస్ మరియు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యుమినియం ఫ్రేమ్ తో ఈ ఫోన్ ను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు మరియు వెనుక రెండు వైపులా కూడా గొరిల్లా గ్లాస్ 7i స్ట్రాంగ్ గ్లాస్ ప్రొటక్షన్ కూడా అందించింది. ఈ ఫోన్ 6.83 ఇంచ్ LTPS AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా గట్టి మరియు పటిష్టమైన డిజైన్ తో అందించింది.
రెనో 14 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ AI 5జి చిప్ సెట్ Dimensity 8450 తో పని చేస్తుంది. ఈ ఆక్టాకోర్ ప్రోసెసర్ తో జతగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు క్విక్ రెస్పాన్స్ అందించే 512 జీబీ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ కలర్ OS 15.0.2 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల OS అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.

కెమెరా పరంగా, ఈ రెనో 14 ప్రో స్మార్ట్ ఫోన్ లో మొత్తం నాలుగు 50MP కెమెరాలు అందించింది. ఇందులో వెనుక 50MP మెయిన్, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP JN5 సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ఆల్ సెన్సార్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ తో పాటు గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది.
ఈ ఒప్పో కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ 80W వైర్డ్ మరియు 50W ఎయిర్ ఊక్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు 3 మైక్ నోయిస్ క్యాన్సిలేషన్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: Google Doodle: AI Mode కోసం గూగుల్ డూడుల్ తో ప్రమోషన్ మొదలు పెట్టిన గూగుల్.!
Oppo Reno 14 Pro 5G : ప్రైస్
ఒప్పో రెనో 14 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ. 49,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు 12 జీబీ + 512 జీబీ వేరియంట్ రూ. 54,999 ప్రైస్ ట్యాగ్ తో ఒప్పో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లను తక్కువ ధరలో అందుకునేలా గొప్ప లాంచ్ ఆఫర్లు అందించింది.

లాంచ్ ఆఫర్లు
ఒప్పో రెనో 14 ప్రో స్మార్ట్ ఫోన్ పై అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్ ఆప్షన్ పై రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందించింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది. జూలై 8వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది.