Oppo A6 Pro 5G: సైలెంట్ గా 7000 mAh బిగ్ బ్యాటరీ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.!
ఇండియన్ మార్కెట్లో కొత్త Oppo A6 Pro 5G ఫోన్ ను లాంచ్ చేసింది ఒప్పో
ఈ స్మార్ట్ ఫోన్ ను దిగువ మిడ్ రేంజ్ ప్రైస్ లో విడుదల చేసింది
ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకునే అవకాశం కూడా అందించింది
Oppo A6 Pro 5G: ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది ఒప్పో. ఈ స్మార్ట్ ఫోన్ ను దిగువ మిడ్ రేంజ్ ప్రైస్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకునే అవకాశం కూడా అందించింది. ఈ ఒప్పో రెనో 16 సిరీస్ కంటే రెండు రోజుల ముందు సైలెంట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు తెలుసుకోండి.
SurveyOppo A6 Pro 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్
ఒప్పో ఏ6 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ (8GB + 128GB ) వేరియంట్ రూ. 21,999 ధరతో మరియు ఈ ఫోన్ (8GB + 256GB ) హైఎండ్ వేరియంట్ ను రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను బ్రౌన్ మరియు గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఒప్పో అఫీషియల్ సైట్ మరియు అన్ని రిటైల్ షాప్ లో లభిస్తుంది. ఈ ఫోన్ నిన్నటి నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఆఫర్స్
ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా జత చేసి అందించింది. ఈ ఫోన్ పై SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 19,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Oppo A6 Pro 5G : ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.75 ఇంచ్ IPS LCD స్క్రీన్ ఉంటుంది. అయితే ఇది కేవలం (1570 × 720) HD+ పిక్సెల్ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1,125 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ Dimensity 6300 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది ARM Mali-G57 MC2 GPU తో మంచి గ్రాఫికల్ పనితనం అందిస్తుంది.ఈ ఫోన్ 8GB LPDDR4x ర్యామ్ తో మరియు 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్లు కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన సెన్సార్ జతగా 2MP మోనోక్రోమ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అనేకమైన ఒప్పో కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 1080 వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4K కెమెరా సపోర్ట్ లేదని తెలిపింది.
Also Read: Google Pixel 9A పై ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!
ఒప్పో ఈ ఫోన్‌లో 7000mAh పెద్ద బ్యాటరీ అందించింది మరియు ఇది ఒకరోజు కంటే ఎక్కువ బ్యాకప్ అందిస్తుందని ఒప్పో తెలిపింది. అంతేకాదు, 80W SUPERVOOC వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile