బడ్జెట్ ధరలో ఒప్పో 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!

బడ్జెట్ ధరలో ఒప్పో 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!!
HIGHLIGHTS

ఒప్పో తన కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది

ఒప్పో కె 10 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ తో వచ్చింది

ఈ ఫోన్ ను చాలా సన్నని మరియు అందమైన డిజైన్ తో ఒప్పో అందించింది

ఇండియాలో ఒప్పో తన కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలోనే విడుదల చేసింది. అదే, OPPO K10 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మంచి ఫీచర్లను కలిగి వుంది. ఒప్పో ఇండియాలో లేటెస్ట్ గా ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది.  ఒప్పో కె 10 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. అయినా కూడా ఈ ఫోన్ ను చాలా సన్నని మరియు అందమైన డిజైన్ తో ఒప్పో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ మరియు అధిక స్టోరేజ్ లను కూడా జతచేసింది. మరి ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చూద్దామా.

OPPO K10 5G: ధర

ఒప్పో కె 10 5జి స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో కేవలం రూ.17,499 రూపాయల ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ పైన SBI, Kotak, Axis, మరియు Bank Of Baroda బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి ఫ్లాట్ 1,500 రూపాయల డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ జూన్ 15 న మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారిగా సేల్ కి అందుబాటులో వస్తుంది.

OPPO K10 5G: స్పెక్స్

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ ను డిజైన్ పరంగా ఎటువంటి హడావిడీ లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా అందించింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ మరియు HD+ రిజల్యూషన్ అందించగల 6.56 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 తో పనిచేస్తుంది.  ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు జతగా 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నట్లు ఒప్పో తెలిపింది.

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను డ్యూయల్ LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ కెమెరాని అందించింది. అయితే, ఈ కెమెరాతో అల్ట్రా-క్లియర్ 108MP ఇమేజ్ లను అందించగలదని ఒప్పో తెలిపింది. అలాగే, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్  వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W  SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో పంచీ సౌండ్ అందించగల కొత్త తరహా స్పీకర్లను కూడా అందించినట్లు ఒప్పో తెలిపింది.

మొత్తంగా ఈ ఫోన్ ను కంటెంట్, గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ అన్ని వర్గాల వారికీ సరిపోయేలా కంప్లీట్ ప్యాకేజీగా తీసుకువచ్చింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo