Oppo Find N: తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటించిన ఒప్పో
ఎట్టకేలకు ఒప్పో తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ని ప్రకటించింది
OPPO INNO DAY నుండి Oppo Find N పేరుతో మొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది
ఎట్టకేలకు ఒప్పో తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ని ప్రకటించింది. చైనాలో జరుగుతున్న OPPO INNO DAY కార్యకమం నుండి Oppo Find N పేరుతో ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇక ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ తో పోలిస్తే ఒప్పో ఫైండ్ ఎన్ చాలా కాంపాక్ట్ మరియు సరసమైనదిగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒప్పో యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ గురించి కంప్లీట్ గా తెల్సుకుందామా..!
SurveyOppo Find N: ప్రైస్
Oppo Find N ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో CNY 7699 (సుమారు $1200) ధరలో వచ్చింది. అలాగే, 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 8699 (సుమారు $1400) ధరలో ప్రకటించబడింది.
Oppo Find N: స్పెక్స్
ఒప్పో ఫైండ్ ఎన్ పైన 5.49 అంగుళాల కవర్ డిస్ప్లేని 1972×988 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇక మైన్ డిస్ప్లే పెద్ద 7.1-అంగు ళాల LTPO స్క్రీన్ (1792 x 1920)తో మడత పెట్టగలిగేలా ఉంటుంది. అంటే కవర్ డిస్ప్లే పరంగా చూస్తే ఈ ఫోన్ మడత పెట్టిన స్థితిలో ఈ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ కంటే పెద్దగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ఫోల్డబుల్ స్క్రీన్ 2 లక్షల సార్లు మడత పెట్టిన పాడుకాదు.
ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ Oppo Find N వేగవంతమైన Snapdragon 888 Soc జతగా 12GB LPDDR5 ర్యామ్ శక్తితో వస్తుంది. దీనికి తోడు 512GB UFS 3.1 కూడా జతచెయ్యబడింది.
ఇక కెమెరాలు మరియు యాతర ఫీచర్ల పరంగా, Oppo Find N ఫోన్ లో 50MP SonyIMX766 ప్రధాన సెన్సార్ మరియు దీనికి జతగా 16MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 13MP టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగిన 4500mAh బ్యాటరీని కూడా కలిగివుంది.