Oppo K14 Lite లాంచ్ కంటే ముందే Sale డేట్ అనౌన్స్ చేసిన ఒప్పో .. ఫోన్ ఎలా ఉందంటే.!

HIGHLIGHTS

Oppo K14 Lite లాంచ్ కంటే ముందే Sale డేట్ ని ఒప్పో అనౌన్స్ చేసింది

ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ సేల్ డేట్ ను ఒప్పో అనౌన్స్ చేయడం విశేషం

ఫోన్ సేల్ డేట్ , ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందామా

ఒప్పో సరికొత్తగా ప్రకటించిన Oppo K14 Lite లాంచ్ కంటే ముందే Sale డేట్ ని ఒప్పో అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ సేల్ డేట్ ను ఒప్పో అనౌన్స్ చేయడం విశేషం. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ సేల్ డేట్ , ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందామా.

Oppo K14 Lite : లాంచ్ అండ్ సేల్

ఒప్పో కే 14 లైట్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అండ్ సేల్ డేట్ ఒక్కటే అని అర్థం చేసుకోవాలి. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ కంపెనీ అఫీషియల్ అకౌంట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Oppo K14 Lite : ఫీచర్స్

ఒప్పో కే 14 లైట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో లాంచ్ చేస్తున్న మరో బడ్జెట్ ఫోన్ గా చెప్పబడుతుంది. ఈ ఫోన్ ను స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 6.75 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో జతగా ట్రినిటీ ఇంజన్ సపోర్ట్ తో అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 4GB వర్చువల్ ర్యామ్ కలిపి టోటల్ 8GB ర్యామ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది.

ఇది డైలీ యూసేజ్ మరియు సీమ్ లెస్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ Color OS 16 జతగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో అందిస్తుంది. ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ బ్యాటరీ 72 నెలలు అంటే 6 సంవత్సరాలు మన్నిక అందించే బెస్ట్ బ్యాటరీ అని కూడా తెలిపింది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఒప్పో కొత్త ఫోన్ లో వెనుక 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ నైట్ మోడ్, పోర్ట్రైట్ మోడ్ మరియు రీ టచ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.. ఆఫర్ ఎక్కడ లభిస్తుందంటే.!

అంచనా ధర

ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :