సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.. ఆఫర్ ఎక్కడ లభిస్తుందంటే.!
సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకునే అవకాశం
ఆఫర్స్ కారణంగా ఈ బడ్జెట్ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది
డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం సాధారణ సౌండ్ బార్ రేటుకే లభిస్తోంది
సాధారణ సౌండ్ బార్ రేటుకే Sony Dolby సౌండ్ బార్ అందుకునే అవకాశం ఈరోజు మీకోసం ఎదురు చూస్తోంది. భారత మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన లేటెస్ట్ సోనీ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఈ రోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం సాధారణ సౌండ్ బార్ రేటుకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కారణంగా ఈ బడ్జెట్ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది.
SurveySony Dolby సౌండ్ బార్ ఆఫర్
సోనీ యొక్క 2.0 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ HT-S100F 2.0 మోడల్ ఈరోజు ఈ ధరలో మీకు లభిస్తుంది. ఎలాగంటే, రూ. 9,990 రూపాయల ధరలో సోనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా రూ. 2,001 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 7,989 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

ఈ ఆఫర్ తో పాటు ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందిస్తుంది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ పై SBI క్రెడిట్ కార్డు 10% డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందించింది. అంటే, ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి ఈ రోజు SBI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 800 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,189 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది నిజంగా చూడదగిన బిగ్ డీల్ అవుతుంది. ఆఫర్ కోసం Buy From Here పై నొక్కండి.
Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
సోనీ యొక్క ఈ సౌండ్ బార్ 2.0 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో కేవలం బార్ మాత్రమే ఉంటుంది. ఇందులో రెండు డీప్ బాస్ స్పీకర్ మరియు రెండు హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అందించే ట్వీటర్లు ఉంటాయి. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ మంచి క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఇది చాలా ప్రీమియం లుక్ మరియు సింపుల్ సెటప్ తో వస్తుంది. జస్ట్ ‘ప్లగ్ అండ్ ప్లే’ మీకు ఈ సౌండ్ బార్ తో లభిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ 2.0 డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో ఇది మీ టీవీ తో వచ్చే స్పీకర్లు కంటే ఉన్నతమైన సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, LDAC మరియు S-Force ఫ్రంట్ సౌండ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. నిజానికి ఇది మీ బెడ్ రూమ్ మరియు లివింగ్ రూమ్ లో మంచి అందం తో పాటు గొప్ప సౌండ్ అందిస్తుంది. అయితే, ఇంటిని షేక్ చేసే సౌండ్ కోరుకుంటే మీరు సబ్ ఉఫర్ తో వచ్చే ఇతర మోడల్స్ ని పరిశీలించండి. ఇది HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
