OPPO K13x 5G Sale: ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

HIGHLIGHTS

ఒప్పో కె 13x స్మార్ ఫోన్ మొదటి సేల్ రేపు ప్రారంభం అవుతుంది

ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ AI స్మార్ట్ ఫోన్ OPPO K13x 5G Sale

ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

OPPO K13x 5G Sale: ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

OPPO K13x 5G Sale: ఒప్పో లేటెస్ట్ బడ్జెట్ AI స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 13x స్మార్ ఫోన్ మొదటి సేల్ రేపు ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ బడ్జెట్ ధరలో మిలటరీ గ్రేడ్ ఆర్మర్ బాడీ, 6000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆఫర్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO K13x 5G Sale: ఆఫర్

ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్ ధర వివరాలు ఇక్కడ చూడండి.

బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర : రూ. 11,999

మిడిల్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర : రూ. 12,999

హైఎండ్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర : రూ. 14,999

ఆఫర్లు

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. SBI, Axis, ICICI వంటి చాలా ప్రధాన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు మరియు EMI ఆఫర్ పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కోడోత్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 10,999 ప్రారంభ ధరకే లభిస్తుంది.

OPPO K13x 5G Sale

అయితే, ఈ ఆఫర్ కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఒప్పో ప్రకటించింది. ఈ ఫోన్ మొదటి సేల్ రేపు (జూన్ 27) మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు Oppo అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి సేల్ అవుతుంది.

Also Read: ZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తుంది.!

OPPO K13x 5G : స్పెక్స్ అండ్ ఫీచర్స్

ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ మంచి మిలటరీ గ్రేడ్ ఆర్మర్ బాడీ మరియు షాక్ ప్రూఫ్ తో వస్తుంది. అంతేకాదు, IP65 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. గొప్ప రక్షణ కలిగిన పటిష్టమైన బాడీ కలిగిన ఫోన్ కోరుకునే వారి కోసం ఈ ఫీచర్ అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB / 6GB / 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఆప్షన్ లను అందించింది. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ HD ప్లస్ రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది.

ఒప్పో కె 13x 5జి స్మార్ట్ ఫోన్ లో గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగిన 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ FHD (1080P) వీడియో రికార్డ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో భారీ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ 300% పెద్ద సౌండ్ అందించే గొప్ప స్పీకర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile