Oppo K10: మార్చి 23 న విడుదలకు సిద్దమవుతున్న ఒప్పో కొత్త ఫోన్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!!

HIGHLIGHTS

ఒప్పో ఇండియాలో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది

మార్చి 23 న Oppo K10 లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఒప్పో

ఈ ఫోన్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది

Oppo K10: మార్చి 23 న విడుదలకు సిద్దమవుతున్న ఒప్పో కొత్త ఫోన్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!!

ఒప్పో ఇండియాలో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. మార్చి 23 న ఇండియాలో Oppo K10 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది, అంటే ఇది ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకువస్తోందని అర్ధం చేసుకోవచ్చు. ఒప్పో కే10 యొక్క కీ స్పెషిఫికేషన్ లను గురించి కూడా ఇప్పటికే టీజింగ్ వెల్లడించింది. ఈ ఫోన్ ను స్టైలిష్ డిజైన్ మరియు మంచి ఫీచర్లతో తీసుకువస్తునట్లు ఒప్పో టీజ్ చేస్తోంది.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K10: రివీల్డ్ స్పెక్స్

ఒప్పో కే10  ఫోన్ ను పంచ్ హోల్ డిజైన్ కలిగిన స్క్రీన్ తో తీసుకువస్తోంది మరియు ఈ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి ని కలిగి వుంది. ఈ సెల్ఫీ కెమెరా రాత్రయినా పగలైనా వెలుతురులో సంభంధం లేకుండా మంచి ఫోటోలు తియ్యగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్లో వుంది. 

Oppo K10.jpg

ఈ ఫోన్ యొక్క మైన్ కెమెరాల వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు జతగా మరొక రెండు కెమెరాలు ఉంటాయి.  ఈ ఫోన్ లో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీని కూడా వుంది. ఈ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ రెండు కలర్ లలో కనిపిస్తోంది.   

ఈ ఫోన్ తో పాటుగా Oppo Enco Air 2 ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా ఒప్పో లాంచ్ చేస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo