OPPO K10 5G: రేపు లాంచ్ అవనున్న ఒప్పో కొత్త ఫోన్.. ఇవే ఫీచర్లు..!!

HIGHLIGHTS

ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది

OPPO K10 5G ను వేగవంతమైన 5G ప్రాసెసర్ Dimensity 810 తో తీసుకువస్తోంది

ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చాలా నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తోంది

OPPO K10 5G: రేపు లాంచ్ అవనున్న ఒప్పో కొత్త ఫోన్..  ఇవే ఫీచర్లు..!!

రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి డేట్ సెట్ చేసింది. అదే, OPPO K10 5G మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను వేగవంతమైన 5G ప్రాసెసర్ Dimensity 810 తో తీసుకువస్తోంది. ఇప్పటికే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart  ప్రత్యేకమైన మైక్రో సైట్ అందించింది మరియు టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన వివరాలను కూడా ఒప్పో టీజింగ్ ద్వారా వెల్లడించింది. మరి రేపు విడుదల కానున్న ఒప్పో కొత్త ఎటువంటి ప్రత్యేకతలతో రాబోతోందో తెల్సుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO K10 5G: స్పెక్స్

రేపు విడుదల కానున్న ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా చాలా నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తోంది. అంటే, ఎటువంటి హడావిడీ లేకుండా చక్కగా అందించింది. ఈ ఫోన్  వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 810 తో తీసుకువస్తునట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ 8GB ర్యామ్ కి జతగా 5GB ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి ఉన్నట్లు ఒప్పో టీజర్ ద్వారా తెలిపింది.

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను డ్యూయల్ LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఈ ఫోన్  వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W  SuperVOOC సపోర్ట్ కలిగిన బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో కొత్త తరహా స్పీకర్లను అందించినట్లు కూడా ఒప్పో చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo