OPPO F31 సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొత్త AI Voice Scribe ఫీచర్ తో లాంచ్ అవుతున్నాయి.!
OPPO F31 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కోసం ఒప్పో టీజింగ్ స్టార్ట్ చేసింది
AI Voice Scribe ఫీచర్ తో లాంచ్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేసింది
రికార్డింగ్స్ వంటి వాటిని రియల్ టైమ్ లో తర్జుమా చేసే అవకాశం
OPPO F31 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కోసం ఒప్పో టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న ఫోన్స్ మరియు ఈ సిరీస్ ఫోన్ల కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఇప్పటికే సిరీస్ కోసం అందించిన టీజింగ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు AI Voice Scribe ఫీచర్ తో లాంచ్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేసింది. ఇదే కాదు ఈ ఫోన్ కీలకమైన అంచనా ఫీచర్లు కూడా బయటకు వెల్లడయ్యాయి.
SurveyOPPO F31 సిరీస్ ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ లాంచ్ కోసం ఒప్పో కొత్తగా అందించిన టీజర్ వీడియో AI Voice Scribe ఫీచర్ గురించి టీజింగ్ చేసింది. ఈ టీజర్ వీడియో లో ఈ ఫీచర్ గురించి తెలియపరిచింది. ఈ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ అన్ని భాషలను Ai సహాయంతో రియల్ టైమ్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే, యూజర్ కావాలనుకుంటే కాల్స్ మరియు రికార్డింగ్స్ వంటి వాటిని రియల్ టైమ్ లో తర్జుమా చేసే అవకాశం ఉంటుందని ఒప్పో చెబుతోంది.

ఇక ఈ ఫోన్ డిజైన్ కూడా ఈ వీడియోలో చూపించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తునట్లు ఒప్పో తెలిపింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అంచనా ఫీచర్స్ కొన్ని ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. ఇందులో ఈ ఫోన్ యొక్క బ్యాటరీ, ఛార్జ్ టెక్ మరియు చిప్ సెట్ వివరాలు కూడా ఉన్నాయి.
Also Read: AI Future Risks గురించి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు చెబుతున్న Chat GPT
OPPO F31 : అంచనా ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 31 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ కావచ్చని చెబుతున్నారు. ఇందులో 50MP AI డ్యూయల్ కెమెరా మరియు 16Mp సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ 6.57 ఇంచ్ AMOLED స్క్రీన్ ను ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా IP69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఈ ఫోన్ ఫీచర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంటుంది.
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile