Oppo F21 Pro Series నుండి రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన ఒప్పో..!!

Oppo F21 Pro Series నుండి రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన ఒప్పో..!!
HIGHLIGHTS

ఒప్పో F21 సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది

Oppo F21 Pro 4G మరియు F21 Pro 5G

అక్షర్షణీయమైన డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చాయి

ఒప్పో F21 సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి Oppo F21 Pro 4G మరియు F21 Pro 5G స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డిస్ప్లే మరియు మరికొన్ని ఫీచర్లు ఒకేవిద్ధంగా ఉంటాయి. సెల్ఫీ కెమెరా, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ మరియు ప్రాసెసర్ లలో మాత్రమే మార్పు ఉంటుంది. కొత్తగా వచ్చిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెక్స్, ధర మరియు పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం.       

Oppo F21 Pro Series: స్పెక్స్

ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్ నుండి వచ్చిన ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తాయి. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంటుంది. అయితే, ఎఫ్ 21 ప్రో 5G వెర్షన్ మాత్రం 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. F12 Pro డిస్ప్లేలో అందించిన పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కలిగి ఉండగా, 5G వెర్షన్ మాత్రం 16MP సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది.

ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, Oppo F21 Pro లేటెస్ట్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ కలిగి ఉంటే, F21 Pro 5G మాత్రం స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఈ రెండు వేరియంట్ లు కూడా కేవలం సింగిల్ ర్యామ్ వేరియంట్ తో మాత్రమే వస్తాయి.  

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లలో కూడా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 64MP మైన్ కెమెరాకి జతగా 2ఎంపి డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపి మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ColorOS 12.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తాయి. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్ మరియు సన్‌సెట్ ఆరెంజ్ అనే రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.

Oppo F21 Pro Series: ధర మరియు సేల్

పైన తెలిపి విధంగా, Oppo F21 Pro సింగిల్ వేరియంట్ (8GB +128GB) రూ.22,999. అలాగే, అదే మెమరీ కాన్ఫిగరేషన్ కలిగిన Oppo F21 Pro 5G మోడల్ సింగల్ వేరియంట్ ధరరూ.26,999.

మీరు Oppo F21 Pro ని ఏప్రిల్ 15 నుండి కొనుగోలు చేయవచ్చు మరియు Oppo F21 Pro 5G ఏప్రిల్ 21 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్స్ Amazon ఇండియా మరియు దేశంలోని ఇతర ప్రముఖ రిటైలర్‌ షాపుల ద్వారా అందుబాటులో ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo