OPPO మరియు షావోమి కొత్త టెక్నీక్ : ఇక ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్లు రానున్నాయి

Updated on 03-Jun-2019
HIGHLIGHTS

తన ట్విట్టర్ పేజీలో అందించిన ఒక స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ వీడియోలో దీనికి సంబంధించిన విషయాన్ని చూపిస్తోంది.

ఇప్పటివరకూ, ఫుల్ వ్యూ, నోచ్, వాటర్ డ్రాప్ నోచ్ , పాప్ అప్, పంచ్ హోల్ ఇలాంటి పేర్లన్నీ కూడా సెల్ఫీ కేమెరా కోసం తీసుకొచ్చిన అనేకమైన ప్రయత్నాలుగా చెప్పొచ్చు. అయితే, OPPO సంస్థ వీటన్నిటిని పక్కన పెట్టి డిస్ప్లేలోపలే, బయటకి కనబడకుండా ఒక సెల్ఫ్ కెమేరాని అందించనున్నట్లు చెబుతోంది. తన ట్విట్టర్ పేజీలో అందించిన ఒక స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ వీడియోలో దీనికి సంబంధించిన విషయాన్ని చూపిస్తోంది.

ఈ టీజింగ్ వీడియోలో, ఒక స్మార్ట్ ఫోన్, అతితక్కువ బెజెల్లతో ఎటువంటి నోచ్ లేకుండా కనిపిస్తుంది. దీనితో సెల్ఫీ ఫోటోను తీసేటప్పుడు మాత్రం డిస్ప్లేలోపల ఒక సెల్ఫీ కెమేరా ఉన్నట్లు కనిపిస్తుంది. అదీకూడా, కేవలం సెల్ఫీ కెమేరా ఎంపికలను ఎంచుకున్నప్పుడు మాత్రమే, ఆ సెల్ఫీ కెమేరా కనిపిస్తుంది. మాములుగా ఉన్నప్పుడు, ఇందులో ఒక సెల్ఫీ కెమేరా ఉన్నట్లు అస్సలు తెలియండలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :