Oneplus 9RT 5G: విడుదలకు ముందే ధర వివరాలు లీక్.. రేపు లాంచ్ కానున్న ఫోన్

Oneplus 9RT 5G: విడుదలకు ముందే ధర వివరాలు లీక్.. రేపు లాంచ్ కానున్న ఫోన్
HIGHLIGHTS

Oneplus 9RT 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదలకానుంది

డుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి

రేపు వన్ ప్లస్ RT 5G మరియు Buds Z2 లను ఇండియాలో ఆవిష్కరించనుంది

Oneplus 9RT 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదలకానుంది. అయితే, విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి. రేపు జరగనున్న ఈవెంట్ ద్వారా వన్ ప్లస్ 9RT 5G మరియు OnePlus Buds Z2 ట్రూ బడ్స్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 888 తో వస్తోంది. జనవరి 14 5PM, అంటే రేపు సాయంత్రం 5 గంటలకు వన్ ప్లస్ RT 5G మరియు Buds Z2 లను ఇండియాలో ఆవిష్కరించనుంది.     

ప్రముఖ టిప్ స్టర్ యోగేష్ బ్రార్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, OnePlus 9RT 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్‌ రూ. 42,999 ధరతో, 12GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 46,999 నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

 

 

OnePlus 9RT 5G: స్పెసిఫికేషన్లు

OnePlus 9RT 5Gపెద్ద 6.62 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫికేషన్ తో FHD+ రిజల్యూషన్ తో కలిగి  ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు Adreno 660 GPU కలిగిన స్నాప్‌డ్రాగన్ 888 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఎంపికలతో జత చేయబడింది.

ఆప్టిక్స్ విషయానికి  వస్తే, OnePlus 9RT 5Gస్మార్ట్ ఫోన్  OIS సపోర్ట్ గల 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఈ ఫోన్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 29 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని OnePlus పేర్కొంది.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo