OnePlus Nord CE4: ఈ టాప్ 5 ఫీచర్స్ ఆకట్టుకునే ధరలో వచ్చింది.!

OnePlus Nord CE4: ఈ టాప్ 5 ఫీచర్స్ ఆకట్టుకునే ధరలో వచ్చింది.!
HIGHLIGHTS

OnePlus Nord CE4 విడుదల చెయ్యబడింది

ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు ప్రైస్ తో ఈ ఫోన్ వచ్చింది

100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది

OnePlus Nord CE4: వన్ ప్లస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంఛ్ చేసింది. చాలా కాలంగా ఈ ఫోన్ గురించి కంపెనీ చాలా టీజింగ్ చేసింది. ఈ టీజర్స్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉంటాయని ఒక ఐడియా ముందే అందించింది. అయితే, ఫోన్ లాంఛ్ తరువాత ఈ ఫోన్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు ప్రైస్ తో ఉన్నట్లు అర్ధమవుతుంది.

OnePlus Nord CE4: Price

వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ ని రూ. 24,999 స్టార్టింగ్ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను ఈ రేటు తో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ని రూ. 26,999 ధరతో లాంఛ్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అంధుబాటులోకి వస్తుంది.

OnePlus Nord CE4 టాప్ 4 ఫీచర్స్

Performance

OnePlus-Nord-CE4 Processor
OnePlus-Nord-CE4 Processor

వన్ ప్లస్ ఈ ఫోన్ ను వేగవంతమైన Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో అందించింది. ఈ ప్రోసెసర్ ని వన్ ప్లస్ ట్రినిటీ ఇంజన్ తో జత చేయడం ద్వారా గొప్ప పెర్ఫార్మన్స్ కి హామీ ఇస్తోంది.

RAM & Storage

OnePlus Nord CE4 Ram & Rom
OnePlus Nord CE4 Ram & Rom

ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను 8GB RAM + 8GB అధనపు RAM ఫీచర్ తో కలిపి టోటల్ 16GB RAM ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ లో హెవీ 256GB UFS 3.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ ను మరియు ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

Display

ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 2160Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్ మరియు Amazon Prime Video HDR సపోర్ట్ వంటి ఫీచర్స్ ను కలిగి వుంది.

Also Read: జబర్దస్త్ ఆఫర్: బిగ్ డిస్కౌంట్ తో 20 వేలకే బ్రాండెడ్ QLED TV లభిస్తోంది.!

Camera

వన్ ప్లస్ ఈ ఫోన్ లో రెండు Sony సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సిస్టం ను అందించింది. ఇందులో 50 MP Sony LYT600 + 8 MP Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమేరా EIS మరియు OIS సపోర్ట్ తో వస్తుంది. ఇది 4K video మరియు సూపర్ స్లో మోషన్ వంటి మరిన్ని ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16 MP సెల్ఫీ కెమేరా కూడా ఉంటుంది.

Battery & Others

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో Hi-Res, Hi-Res wireless మరియు నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo