పేలిన OnePlus Nord CE స్మార్ట్ ఫోన్… ఆన్లైన్లో ఫోటో షేర్ చేసిన యూజర్..!

HIGHLIGHTS

OnePlus Nord CE పేలినట్లుగా పేర్కొన్న యూజర్

ట్విట్టర్ లో పేలిన ఫోన్ ఫోటోలను పోస్ట్ చేశారు

వన్ ప్లస్ నార్డ్ CE స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా పేలినట్లుగా తెలిపారు

పేలిన OnePlus Nord CE స్మార్ట్ ఫోన్… ఆన్లైన్లో ఫోటో షేర్ చేసిన యూజర్..!

వన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ పేలినట్లుగా నివేదికలు వచ్చిన తరువాత, OnePlus Nord CE స్మార్ట్ ఫోన్ తన కళ్ళముందరే పేలినట్లు ఒక నార్డ్ CE స్మార్ట్ ఫోన్ యూజర్ Linkedin మరియు ట్విట్టర్ లో పేలిన ఫోన్ ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ సంఘటన జనవరి 2 న జరిగింది మరియు ఈ పేలుడులో ఎవరూ గాయ పడకపోవడం విశేషం. అయితే, OnePlus యొక్క ఉత్పత్తుల పైన వన్ ప్లస్ చేస్తున్న చెకింగ్ పైన ఈ ఘటనలు ప్రశ్నలు రేకెత్తేలా చేస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE పేలినట్లుగా పేర్కొన్న యూజర్ పేరు దుష్యంత్ గోస్వామి. ఈ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రకారం, 6 నెలల క్రితం కొనుగోలుచేసి తన వన్ ప్లస్ నార్డ్ CE స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా పేలినట్లుగా తెలిపారు. తన జేబులో ఉన్న ఫోన్ బాగా వేడెక్కడంతో జేబులోంచి బయటకు తీశాడు. ఫోన్ తీసిన కొద్దీ సేపటి తరువాత ఈ ఫోన్ హఠాత్తుగా పేలింది.

ఈ ఫోన్ కొన్నప్పటి నుండి బాగానే పనిచేసిందని, 2022 జనవరి 2న ఫోన్ వేడెక్కడంతో  జేబులోంచి బయటకు తీశానని, తీసిన 2 నుండి 5 సెకన్ల లోపలే ఈ ఫోన్ పేలిపోయిందని, సదరు వినియోగదారుడు తెలిపాడు. అంతేకాదు, అదృష్టవశాత్తు తనకు ఏమి జరగ లేదని కూడా తెలిపాడు. దుష్యంత్ ఈ విషయాన్ని తన Linkedin లో పోస్ట్‌ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు.

 

 

ఈ విషయాన్ని వన్‌ప్లస్‌కు కూడా తెలియజేసినట్లు కూడా ఈ వ్యక్తి చెప్పారు. దుశ్యంత్ తన పోస్ట్ లో OnePlus CEO నవనీత్ నక్రా మరియు కంపెనీ వ్యవస్థాపకుడు పీట్ లాను కూడా ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన OnePlus ఇండియా సపోర్ట్ దుష్యంత్‌ ను తమను సంప్రదించమని కోరుతూ ట్వీట్ చేసింది.

ఈ క్లెయిమ్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి, అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మరియు నార్డ్ CE ఫోన్ ఎలా పేలిపోయిందో తెల్సుసుకోవడానికి మేము దుశ్యంత్ మరియు OnePlus ఇరువురిని సంప్రదించాము. దీని గురించి మరింత సమాచారం తెలిసిన వెంటనే మీకు తెలియచేస్తాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo