OnePlus Nord CE 6: లాంచ్ కంటే ముందే లీకైన వన్ ప్లస్ ఫోన్ ప్రైస్.!
OnePlus Nord CE 6 స్మార్ట్ ఫోన్ రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది
లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి
లీక్డ్ ప్రైస్ తో ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే పూర్తి వివరాలు బయటకు వెల్లడైనట్లు అనిపిస్తుంది
OnePlus Nord CE 6 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. అయితే, లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కంపెనీ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే, ఇప్పుడు ఆన్లైన్ లో దర్శనమిచ్చిన లీక్డ్ ప్రైస్ తో ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే పూర్తి వివరాలు బయటకు వెల్లడైనట్లు అనిపిస్తుంది.
SurveyOnePlus Nord CE 6: లీక్డ్ ప్రైస్
వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ ను రూ. 25,000 నుంచి రూ. 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని ప్రముఖ లీక్ స్టర్ అభిషేక్ యాదవ్ తన X అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.
Here is your first hands-on look at the OnePlus Nord CE6. The bezels on this one are minimal and the smartphone looks premium from the front. I am reviewing the Fresh Blue variant.
— Abhishek Yadav (@yabhishekhd) May 4, 2026
The Nord CE6 will be priced around Rs. 25,000 to Rs. 30,000 and is set to launch on May 7, 2026.… pic.twitter.com/9nKvowxd27
ఈ ట్వీట్ ప్రకారం, వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ఫోన్ గా ఇండియాలో అడుగుపెడుతుందని మనం అంచనా వేయవచ్చు. అయితే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ తర్వాత ఈ ఫోన్ లీక్డ్ ప్రైస్ లో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.
OnePlus Nord CE 6: ఫీచర్స్
ఇక వన్ ప్లస్ నార్డ్ CE 6 ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో పవర్ ఫుల్ 8000mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బిగ్ బ్యాటరీ ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెడుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ మరియు 27W వేగవంతమైన రివర్స్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను గేమింగ్ కోసం అవసరమైన బిగ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 3840Hz PMW డిమ్మింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా గేమింగ్ సమయంలో ఈ ఫోన్ స్క్రీన్ ను మరింత వేగంగా హ్యాండిల్ చేసే ప్రత్యేకమైన టచ్ రిఫ్లెక్స్ చిప్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.
వన్ ప్లస్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఇది క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 4nm చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS జత ఆండ్రాయిడ్ 16OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ 6 సంవత్సరాల స్మూత్ పర్ఫామెన్స్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
Also Read: True Wireless 5.1.2 Dolby Atmos ప్రీమియం సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ యాక్సిస్ OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు మెయిన్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటాయి. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile