ఈరోజు విడుదలైన OnePlus Nord CE 2 5G: ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ..!

ఈరోజు విడుదలైన OnePlus Nord CE 2 5G: ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ..!
HIGHLIGHTS

OnePlus Nord CE 2 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది

OnePlus Nord CE 2 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఆకర్షణనీయమైన డిజైన్, 64MP AI ట్రిపుల్ కెమెరా మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ఈరోజు ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ గురించి మీరు తెల్సుసుకోవాల్సిన ప్రతి విషయం ఈ క్రింద అందించాను.

OnePlus Nord CE 2 5G: ధర

వన్ ప్లస్ నార్డ్ CE 2 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, బహామా బ్లూ మరియు గ్రే మిర్రర్ అనే రెండు కలర్లలో లభిస్తుంది.   

1. OnePlus Nord CE 2 5G :  (6GB + 128GB) – రూ.23,999

2. OnePlus Nord CE 2 5G :  (8GB + 128GB) – రూ.24,999

ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ICICI బ్యాంక్ కార్డ్స్ పైన 3 నెలల EMI అప్షన్ తో తీసుకునే వారికి NoCostEMI అఫర్ మరియు ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డ్స్ తో EMI ద్వారా కొనేవారికి 1500 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది.      

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ Fluid AMOLED డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఈ డిస్ప్లే HDR 10+ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఇచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది. ఈ కెమెరా PDAF మరియు CAF వంటి మల్టి ఆటో ఫోకస్ లకు సపోర్ట్ చేస్తుంది. ముందుభాగంలో కూడా EIS సపోర్ట్ కలిగిన 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo