వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ OnePlus Nord 2T లాంచ్ డేట్ ని కంపెనీ ఇంతవరకూ అనౌన్స్ చెయ్యలేదు కానీ, ఈ ఫోన్ యొక్క సేల్ డేట్ కూడా ఆన్లైన్లో లో లీకైనట్లు తెలుస్తోంది. ఈ సేల్ మరియు లాంచ్ డేట్ గురించి ఇప్పటికే చాల నివేదికలు వచ్చాయి. జూలై 1 న వన్ ప్లస్ నార్డ్ 2T ఇండియాలో విడుదలవుతుందని, అదే రోజు నుండి సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుందని కూడా రూమర్లు మరియు లీక్స్ వెల్లడిస్తున్నాయి. అయితే, వన్ ప్లస్ మాత్రం ఈ ఫోన్ యొక్క లాంచ్ లేదా సేల్ డేట్ గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు.
Survey
✅ Thank you for completing the survey!
అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్ యొక్క కీలకమైన వివరాలను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ టీజర్ మరియు లాంచ్ నోటిఫికేషన్ కోసం Notify Me నోట్ ను కూడా అందించింది. మరి ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి తెలుసుకుందామా.
ఇక వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలను కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క వేగవంతమైన 5G చిప్ సెట్ Dimensity 1300 శక్తితో వస్తుంది.
ఇక కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ వెనుక మైన్ కెమెరా గురించి కంపెనీ టీజింగ్ అందించింది. దీని ప్రకారం, OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP SonyIMX766 సెన్సార్ తో వస్తుంది. ఈ కెమెరాతో కాంతి తక్కువగా ఉన్న సమయంలో కూడా గొప్ప ఫోటోలను చిత్రీకరించ వచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ అవుట్ ఆఫ్-ది-బాక్స్ ఆక్సిజన్ OS 12.1 సాఫ్ట్ వేర్ ఆధారితంగా నడుస్తుంది.