వన్‌ప్లస్ నార్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్: అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి
వన్‌ప్లస్ తన అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ 2 లాంచ్ డేట్ ఫిక్స్
వన్‌ప్లస్ 9 సిరీస్‌కు సమానమైన డిజైన్
వన్‌ప్లస్ తన అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ 2 ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్ ఫోన్ ను జూలై 22 న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ దాదాపుగా వన్‌ప్లస్ 9 సిరీస్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మాత్రమేకాదు వన్‌ప్లస్ నార్డ్ 2 లేటెస్ట్ మీడియాటెక్ ప్రొసెసర్ Dimensity 1200 AI SoC తో వస్తున్నట్లు ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క ఎక్స్ పెక్టెడ్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ గురించి చూద్దాం.
SurveyOnePlus Nord 2 Rumored Specs
వన్‌ప్లస్ నార్డ్ 2 యొక్క ఎక్స్ పెక్టెడ్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ హై రిజల్యూషన్ డిస్ప్లే తో రావచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 2 మీడియాటెక్ యొక్క లేటెస్ట్ మరియు ఫాస్ట్ ప్రాసెసర్ Dimensity 1200 AI SoC తో వస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ కూడా ఆక్సిజన్ స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది.
ఇక కెమెరా సెటప్ గురించి చూస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంటుంది. ఈ సెటప్, 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి క్లీన్ సెటప్ తో ఉంటుంది మరియు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ తో ఉంటుంది. ఈ ఫోన్ 4,500 mah బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
OnePlus Nord 2: Expected Price
వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ రూ.30,000 రూపాయల కంటే తక్కువ ధరకే ప్రకటించ వచ్చని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
