OnePlus N6x with 7000 mAh battery launch date and sale date also confirmed
OnePlus N6x: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు సేల్ ను డేట్ ను కూడా ముందే రివీల్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ సైతం వన్ ప్లస్ రివీల్ చేసింది. వన్ ప్లస్ కంపెనీ ఇండియాలో కంపెనీ బంద్ చేసే అవకాశం ఉందని కొంత మంది పుకార్లు రేపుతుంటే, వన్ ప్లస్ మాత్రం వరుసగా తన స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ సమాధానం చెబుతోంది.
వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు సేల్ డేట్ ని కూడా వన్ ప్లస్ రివీల్ చేసింది. ఈ ఫోన్ జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది మరియు ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సేల్ లాంచ్ కంటే ముందే సేల్ డేట్ అనౌన్స్ చేయడం విశేషం.
వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బ్యాటరీ మరియు డిస్ప్లే వివరాలు వన్ ప్లస్ ప్రస్తుతానికి రివీల్ చేసింది. వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ న్యూ డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వెనుక గ్రిప్ లైన్ కలిగిన బ్యాక్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నా కూడా భారీ 7000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బిగ్ బ్యాటరీ ఈ ఫోన్ కు 2.5 డేస్ లాంగ్ బ్యాకప్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
బ్యాటరీ కాకుండా ఈ ఫోన్ డిస్ప్లే గురించి కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ స్మూత్ విజువల్స్ అందించే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా స్లీక్ బెజెల్స్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన విధంగా ఉంటుందని వన్ ప్లస్ తెలిపింది.
Also Read : Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ డేట్ వచ్చేసింది .. ఆఫర్స్ ఎలా ఉంటాయంటే.!
కెమెరా సెటప్ మరియు ఫీచర్లు కూడా వన్ ప్లస్ ఈరోజు రివీల్ చేసింది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరాతో Ai అన్ బ్లర్, Ai ఎరేజర్ మరియు Ai పోర్ట్రెయిట్ గ్లో వంటి లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ బర్ గండి రెడ్ మరియు ఐస్ బ్లూ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.