OnePlus N6x top features and expected price know ahead of launch
OnePlus N6x: వన్ ప్లస్ కొత్త ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ రీసెంట్ గా పరిచయం చేసిన N6 Series నుంచి లాంచ్ అవుతుంది. ఈ కొత్త ఫోన్ ను బిగ్ బ్యాటరీ, స్టైలిష్ డిజైన్, ఫ్లూయిడ్ డిస్ప్లే మరియు స్టన్నింగ్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ లాంచ్ చేయనున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. రేపు ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న ఈ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ ఈరోజే తెలుసుకోండి.
వన్ ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ జూలై 31వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ సేల్ డేట్ కూడా అనౌన్స్ చేసి వన్ ప్లస్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వన్ ప్లస్ న్యూ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు మిలిటరీ గ్రేడ్ MIL-STD 810 H సర్టిఫికేషన్ తో గొప్ప డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. అనుకోకుండా ఈ ఫోన్ చేతిలో నుంచి జారి పడినా కూడా నష్టం వాటిల్లకుండా ఉండే ఫీచర్ గా ఇది చెప్పబడుతుంది. అంతేకాదు, ఎక్కువ సమయం ఉపయోగించినా ఫోన్ వేడెక్కకుండా చూసుకునే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో ఉంది.
ముఖ్యంగా, ఇది 7000 mAh బిగ్ బ్యాటరీ బ్యాటరీతో వస్తుంది. అయితే, ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా స్లీక్ డిజైన్ తో కనిపిస్తుంది ఇది మరో విశేషం. బహుశా ఈ ఫోన్ పెద్ద సైజులో ఉంటుంది కాబోలు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఫ్లూయిడ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది గేమింగ్ మరియు బింజ్ కోసం తగిన విధంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది మరియు ఇది 50MP మెయిన్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఇందులో Ai ఎరేజర్, Ai అన్ బ్లర్ మరియు Ai పోర్ట్రెయిట్ గ్లో వంటి అనేక కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి.
Also Read : vivo T5x 5G న్యూ కలర్ వేరియంట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది.!
వన్ ప్లస్ ఎన్6ఎక్స్ అంచనా ప్రైస్ ను మార్కెట్ వర్గాలు ఆన్లైన్ లో లీక్ చేశారు. ఈ లేటెస్ట్ లీక్స్ ప్రకారం, వన్ ప్లస్ ఎన్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో వచ్చే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ బర్గండి రెడ్ మరియు ఐస్ బ్లూ రెండు కలర్స్ లో లాంచ్ అవుతుంది. అయితే, ఇక్కడ అందించిన ప్రైస్ కేవలం అంచనా ప్రైస్ మాత్రమే అని గమనించాలి.