OnePlus N6 Lite india launch date and features announced
OnePlus N6 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత కొన్ని రోజులుగా ‘కమింగ్ సూన్’ క్యాప్షన్ తో మాత్రమే టీజింగ్ చేసిన వన్ ప్లస్, ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ సైతం ఈరోజు రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది.
వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇది ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది.
Also Read: Realme 16 Pro Harry Potter Edition: సూపర్ డిజైన్ మరియు కెమెరాతో ఎంట్రీకి సిద్ధం.!
వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను మిలటరీ గ్రేడ్ డ్యూరబుల్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ MIL- 810H సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఇది క్రింద పడినా కూడా ఆ షాక్ ను తట్టుకొనే విధంగా ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అనుకోకుండా ఫోన్ జారిపడినా తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. అయితే, ఎంత ఎత్తు నుంచి పడితే షాక్ తట్టుకుంటుందని క్లియర్ గా తెలియ చేయలేదు.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6 సంవత్సరాల లాంగ్ లైఫ్ అందించే 7000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.ఈ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ ని మూడు రోజుల వరకు నిలిపి ఉంచగలదని కూడా వన్ ప్లస్ ఈ ఫోన్ బ్యాటరీ గురించి తెలిపింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద స్క్రీన్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ 3 సంవత్సరాల స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా వన్ ప్లస్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ IP64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.