OnePlus N6 : 60FPS వీడియో కెమెరా మరియు బిగ్ కూలింగ్ సిస్టం తో వస్తుంది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డైలీ అప్‌డేట్స్ అందిస్తున్న కంపెనీ

ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు ఇతర వివరాలు వెల్లడించింది

60FPS వీడియో కెమెరా మరియు బిగ్ కూలింగ్ సిస్టం తో వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది

OnePlus N6 : 60FPS వీడియో కెమెరా మరియు బిగ్ కూలింగ్ సిస్టం తో వస్తుంది.!

OnePlus N6: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డైలీ అప్‌డేట్స్ అందిస్తున్న కంపెనీ, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు ఇతర వివరాలు వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 60FPS వీడియో కెమెరా మరియు బిగ్ కూలింగ్ సిస్టం తో వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ముందుగా ఈ ఫోన్ బ్యాటరీ మరియు డిజైన్ వివరాలు వెల్లడించిన వన్ ప్లస్ ఇప్పుడు ఈ అప్ కమింగ్ ఫోన్ పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus N6 : కొత్త అప్డేట్

వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ కొత్త అప్డేట్ ను ఈరోజు అందించింది. ఈరోజు అందించిన కొత్త అప్డేట్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు కూలింగ్ సిస్టం వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ ను 50MP డ్యూయల్ రియర్ మరియు 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ వెల్లడించింది. ఇందులో ఉన్న మెయిన్ 50MP కెమెరా AI ఎన్ హెన్స్ కెమెరా అని కూడా వన్ ప్లస్ నొక్కి చెప్పింది. ఈ ఫోన్ కలిగిన కెమెరా ఫీచర్స్ కూడా ఇందులో రివీల్ చేసింది.

OnePlus N6

కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కెమెరా 60FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, డ్యూయల్ వీడియో మోడ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు వన్ ప్లస్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

కూలింగ్ సిస్టం

వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో 5300 mm² లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ మరియు మల్టీ టాస్క్ సమయంలో కూడా ఫోన్ ను చల్లగా ఉంచుతుంది. తద్వారా, ఫోన్ కూల్ గా ఉంచి పెర్ఫార్మెన్స్ పెంచుతుంది.

Also Read: Apple Macbook Neo: 80 వేల ల్యాప్ టాప్ ని 60 వేలకే ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

OnePlus N6 : డిజైన్ అండ్ బ్యాటరీ

ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే సింపుల్ అండ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ గా ఉన్నా కూడా 8000 భారీ బ్యాటరీని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS పై ఆక్సిజన్ 16 సాఫ్ట్ వేర్ తో లాంచ్ అవుతుంది. అంతేగాదు, 60 నెలల అప్డేట్స్ మరియు సెక్యూరిటీ అప్డేట్ తో స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా వన్ ప్లస్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile