Apple Macbook Neo: 80 వేల ల్యాప్ టాప్ ని 60 వేలకే ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఆపిల్ ప్రొడక్ట్స్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆపిల్ ల్యాప్ టాప్ ప్రియుల కోసం గొప్ప శుభవార్త అందించింది

మ్యాక్ బుక్ నియో ని కేవలం రూ. 60,490 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని తెలిపింది

Apple Macbook Neo: 80 వేల ల్యాప్ టాప్ ని 60 వేలకే ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

Apple Macbook Neo: ఆపిల్ ప్రొడక్ట్స్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. అయితే, ఈ ప్రొడక్ట్స్ ప్రైస్ కారణంగా చాలా మంది కొనాలని ఆశ ఉన్నా కూడా కొనలేక పోతారు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆపిల్ ల్యాప్ టాప్ ప్రియుల కోసం గొప్ప శుభవార్త అందించింది. రూ. 79,999 ప్రైస్ ట్యాగ్ తో రీసెంట్ గా యాపిల్ విడుదల చేసిన మ్యాక్ బుక్ నియో ని కేవలం రూ. 60,490 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లిస్ట్ చేసిన ఈ బిగ్ డీల్స్ కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple Macbook Neo: ఆఫర్ ఏమిటి?

ఆపిల్ మ్యాక్ బుక్ నియో ఈరోజు కూడా ఆపిల్ స్టోర్ నుంచి రూ. 79.900 ధరతో సేల్ అవుతోంది. అయితే, ఎడ్యుకేషన్ సేవింగ్ ఆఫర్ పై ఇది రూ. 69,900 ధరలో లభిస్తుంది. కానీ, ఇదే మ్యాక్ బుక్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 63,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ చేసింది.

అంతేకాదు, ఈ మ్యాక్ బుక్ ను HDFC క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 3,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో మ్యాక్ బుక్ నియో కేవలం రూ. 60,490 రూపాయల బిగ్ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అయితే, ల్యాప్ డీల్ ఇంకా లైవ్ అవ్వలేదు. ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి ఈ డీల్ రివీల్ చేస్తుందని చెబుతున్నారు.

Apple Macbook Neo

ఈ డీల్ కోసం ‘Notify Me’ బటన్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ బటన్ పై క్లిక్ చేస్తే ఆఫర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

Also Read: 22 వేలకు కొత్త 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి .. మంచి తరుణం మించిన రాదు.!

Apple Macbook Neo: ఫీచర్స్

విద్యార్థులు మరియు సాధారణ వినియోగదారుల రోజువారీ పనుల కోసం ఆపిల్ రూపొందించిన సరసమైన ల్యాప్ టాప్ ఈ ఆపిల్ మ్యాక్ బుక్. ఇందులో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ (2408 × 1506) రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌ నెస్ మరియు 1 బిలియన్ కలర్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ స్క్రీన్ పై ఫోటోలు, వీడియోలు మరియు డాక్యుమెంట్‌ వంటివి చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ ల్యాప్‌ టాప్‌ ను ఆపిల్ యొక్క లేటెస్ట్ A18 Pro చిప్ తో అందించింది. ఇది 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్, 8GB యూనిఫైడ్ మెమొరీ వంటి ఫీచర్స్ తో పాటు 256GB లేదా 512GB SSD స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతు ఉండటంతో AI ఆధారిత పనులు కూడా చాలా సులభంగా నిర్వహించవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 16 గంటల వీడియో స్ట్రీమింగ్ అందించే బ్యాటరీ ఇందులో ఉంటుంది. సిల్వర్, బ్లష్, సిట్రస్ మరియు ఇండిగో వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో మ్యాక్ బుక్ నియో లభిస్తుంది.

కనెక్టివిటీ పరంగా, ఇందులో రెండు USB-C పోర్టులు, 3.5mm హెడ్‌ ఫోన్ జాక్, Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. 4K ఔట్ కోసం ఒక ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను కనెక్ట్ చేయవచ్చు. 1080p Face Time HD కెమెరా, డ్యూయల్ మైక్రోఫోన్లు మరియు డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉంటాయి. ఇందులో Magic Keyboard, పెద్ద మల్టీ టచ్ ట్రాక్‌ప్యాడ్ మరియు ఎంపిక చేసిన మోడళ్లలో Touch ID ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ఈ ల్యాప్ టాప్ macOS ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పని చేస్తుంది మరియు Safari, FaceTime, Pages, Keynote, Numbers వంటి Apple యాప్‌ లు ముందుగానే కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile