OnePlus బ్రాండ్ నుండి మరొక ఫోన్ వస్తుంది..

HIGHLIGHTS

కో- ఫౌండర్ కార్ల్ పే వెల్లడించారు

OnePlus బ్రాండ్ నుండి మరొక ఫోన్ వస్తుంది..

oneplus 2 లో వాడిన ఓల్డ్(ఓల్డ్ అంటే oneplus వన్ లో కూడా ఇదే ప్రొసెసర్ వాడబడింది అని) స్నాప్ డ్రాగన్ 810 మరియు మిగిలిన స్పెసిఫికేషన్స్ మీకు నచ్చలేదా? అయితే మీకొక గుడ్ న్యూస్. oneplus కంపెని మరో ఫోన్ రిలీజ్ చేయనుంది ఈ సంవత్సరంలో.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

తాజగా oneplus కో ఫౌండర్ Pei USA Today కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పారు. ఈ సంవత్సరం క్రిస్టమస్ కు దగ్గరిలో సెకెండ్ మోడల్ ను లాంచ్ చేస్తునట్లు చెప్పారు. అయితే దీని బడ్జెట్ మరియు స్పెసిఫికేషన్స్ పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కంపెని సక్సెస్ అవటానికి కారణమైన లో బడ్జెట్ హై ఎండ్ స్పెక్స్ కాన్సెప్ట్ తోనే 2015 లోని ఈ రెండవ మోడల్ కూడా ఉంటుంది అని మాత్రం కచ్చితంగా expect చేయవచ్చు.

Xiaomi లానే కంపెని oneplus కూడా మొబైల్స్ తో పాటు ఇతర డివైజ్ లను లాంచ్ చేసే ప్లాన్స్ లో ఉందా అని అడిగితే.. గతంలో ఫిట్ నెస్ ట్రాకర్ పై ప్రయోగించాము కాని ఆ ఐడియా ను విడిచి పెట్టాము. కేవలం ఫోన్స్ లోనే మా మార్కెట్ ను కొనసాగిస్తాము అని చెప్పటం జరిగింది. 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo