ONEPLUS 7 PRO స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో Geekbenck లో దర్శనమిచ్చింది

ONEPLUS 7 PRO  స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో Geekbenck లో దర్శనమిచ్చింది
HIGHLIGHTS

Geekbench లో OnePlus GM 1917 మోడల్ నంబర్ గల ఒక స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో దర్శనమిచ్చింది.

ఈ ఫోన్ గీక్ బెంచ్ పైన 3551 సింగల్ కోర్ టెస్ట్ స్కోరును మరియు 11012 మల్టీ కోర్ టెస్ట్ స్కోరును సాధించింది.

వన్ ప్లస్ 7 ప్రో 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజి, 8GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి మరియు 12GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లలో కూడా రానున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ సంస్థ తన మే 14 న తన వన్ ప్లస్ 7 సిరీస్ నుండి వన్ ప్లస్ 7 మరియు వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, మార్కెట్లో ఎప్పుడు స్పీడ్, కొత్త ట్రెండ్ మరియు మన్నికను ప్రధానాంశంగా తన స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చే వన్ ప్లస్, ఇప్పుడు కూడా అదేవిధంగా తన వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లను పరిచయం చేయనుంది. ఇందులో, ఇప్పటి వరకు అత్యుత్తమైన ప్రాసెసర్ గా పేరుగాంచిన, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ కి జతగా ఒక 12GB ర్యామ్ తో వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

Geekbench లో  OnePlus GM 1917 మోడల్ నంబర్ గల ఒక స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో దర్శనమిచ్చింది. ఇది కచ్చితంగా  వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ అయ్యివుంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ ఫోన్ గీక్ బెంచ్ పైన 3551 సింగల్ కోర్ టెస్ట్ స్కోరును మరియు 11012 మల్టీ కోర్ టెస్ట్ స్కోరును సాధించింది. అలాగే, ముందుగా వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, ఈ వన్ ప్లస్ 7 ప్రో 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజి, 8GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి మరియు 12GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లలో కూడా రానున్నట్లు తెలుస్తోంది.

OnePlus 7 మరియు OnePlus 7 Pro ప్రత్యేకతలు

వన్ ప్లస్ 7 ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేతో ఉంటే, OnePlus 7 Pro ఒక 6.7 అంగుళాల కర్వ్డ్ QHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో రానుంది.ఈ రెదను స్మార్ట్ ఫోన్లు కూడా ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరుతో తీసుకురావచ్చు. అయితే, వన్ ప్లస్ 7 ప్రో లో మాత్రం 5G కనెక్టవిటీ కోసం X50 మోడెమ్ తో అందించవచ్చు.

ఇక కెమేరా విభాగానికి వస్తే, OnePlus 7 Pro ఒక ట్రిపుల్ రియార్ కెమేరాతో తీసుకొస్తుంది. ఈ కెమేరా 3X జూమ్ తో రానుంది మరియు ఇందులో ఒక 48MP ప్రధాన కెమేరా f/1.6 అపర్చరుతో ఉంటుంది . దీనికి జతగా 3X జూమ్ చేయగల ఒక f/2.4 అపర్చరు గల 8MP టెలిఫోటో లెన్స్  మరియు ఒక 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా లు ఉంటాయి. ఇక OnePlus 7 విషయానికి వస్తే, ఇది f/1.7 అపర్చరు గల ఒక 48MP ప్రధాన కెమేరాకి జతగా ఒక 5MP డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ రియారా కెమేరా ఉంటుంది.

ఇక బ్యాటరీ సమర్ధయాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 7 ప్రో ఒక 4,000 mAh బ్యాటరీతో మరియు 30W Wrap ఛార్జ్ సపోర్టుతో ఉంటే, వన్ ప్లస్ 7 మాత్రం 3,600mAh బ్యాటరీతో 20W  స్పీడ్ ఛార్జ్ సపోర్టుతో వస్తాయి.                                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo