OnePlus 11 5G: కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్..ఇవే ఫీచర్లు.!

HIGHLIGHTS

కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసిన వన్ ప్లస్

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చాలా క్రేజ్ ను సొంతం చేసుకుంది

ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ తో వస్తున్నట్లు మనం చూడవచ్చు

OnePlus 11 5G: కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్..ఇవే ఫీచర్లు.!

OnePlus 11 5G: కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసిన వన్ ప్లస్. వన్ ప్లస్ ఇండియాలో విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చాలా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ ఫోన్ లో ఎటువంటి ఫీచర్లు ఉండబోతున్నాయని, ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ గురించి ఇప్పటికే అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ కూడా మొదలుపెట్టింది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ అవుతుందని మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 OnePlus 11 5G ఫోన్ గురించి అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ తో వస్తున్నట్లు మనం చూడవచ్చు. వన్ ప్లస్ 11 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 7 వ తేదీ సాయంత్రం 7:30 నిముషాలకు ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక పెద్ద కెమెరా ఐలాండ్ సెటప్ Hasselblad బ్రాండింగ్ తో వుంది మరియు ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ని ఒక LED ఫ్లాష్ లైట్ తో అందించింది. 

ప్రస్తుతం ఆన్లైన్లో వస్తున్న నివేదికలను విశ్వసితే, ఈ కెమేరా సెటప్ లో 50MP ప్రధాన కెమేరాకి జతగా 48MP అల్ట్రా వైడ్ కెమేరా మరియు 32MP టెలిఫోటో కెమేరా ఉండవచ్చు. ముందు సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని అధిక రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉండవచ్చు. అలాగే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని అత్యంత వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo