OnePlus 10T: స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 చిప్ మరియు 16GB ర్యామ్ తో వచ్చింది.!!

OnePlus 10T: స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 చిప్ మరియు 16GB ర్యామ్ తో వచ్చింది.!!
HIGHLIGHTS

వన్‌ప్లస్ యొక్క 10 సిరీస్ కి మరొక స్మార్ట్ ఫోన్ ను జతచేసింది

OnePlus 10T భారీ అంచనాల మధ్య విడుదల

వన్‌ప్లస్ 10T క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8+ Gen 1 శక్తితో పనిచేస్తుది

వన్‌ప్లస్ యొక్క 10 సిరీస్ కి మరొక స్మార్ట్ ఫోన్ ను జతచేసింది.  చాలా కాలంగా OnePlus 10T ఊరిస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఈరోజు ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8+ Gen 1 తో లాంచ్ చెయ్యబడింది. అంతేకాదు, ఈ పాస్ట్ ప్రాసెసర్ కి జతగా 16GB వరకు LPDDR5 RAM ను కూడా జతచేసింది. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా విశేషాలే ఉన్నాయి. మరి ఆ విశేషాలు మరియు ధర వివరాలు ఏమిటో వివరంగా తెలుసుకోండి.              

OnePlus 10T: ధర

వన్‌ప్లస్ 10T యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.49,999. రెండవ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.54,999. OnePlus 10T యొక్క హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.59,999.

వన్‌ప్లస్ 10T యొక్క ప్రీ-ఆర్డర్స్ ను ఓపెన్ చెయ్యగా, భారతదేశంలో ఆగస్టు 6 నుండి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయించబడుతుంది. ఈ ఫోన్ amazon.in, oneplus.in మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

OnePlus 10T: ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ 10టి పెద్ద 6.7 -ఇంచ్ FHD + రిజల్యూషన్ గల Fluid AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది మరియు HDR10+ కి.సపోర్ట్ చేసే 10-బిట్ ప్యానల్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడుతుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ని కలిగివుంది.

10T స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8+ Gen 1 శక్తితో పనిచేస్తుది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 16GB ర్యామ్ LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ 12.1 OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది.

కెమెరా విభాగంలో, వన్‌ప్లస్ 10టి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX766 సెన్సార్ ని OIS సపోర్ట్ మరియు f/1.88 అపర్చర్ తో అందించింది.  దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని అందించింది. మూడవదిగా 2MP మ్యాక్రో లెన్స్ ను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.

వన్‌ప్లస్ 10టి స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ 4,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 150W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. అంతేకాదు, బాక్స్ లో 160W సూపర్ వూక్ పవర్ అడాప్టర్ ని కూడా వన్‌ప్లస్ అఫర్ చేస్తోంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo