OnePlus 10 Pro 5G: భారీ హై ఎండ్ ఫీచర్లతో వచ్చిన వన్ ప్లస్ కొత్త ఫోన్..!!

HIGHLIGHTS

OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల

వన్ ప్లస్ 10 ప్రో 5జి ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది

80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W AIRVOOC ఛార్జింగ్ సపోర్ట్

OnePlus 10 Pro 5G: భారీ హై ఎండ్ ఫీచర్లతో వచ్చిన వన్ ప్లస్ కొత్త ఫోన్..!!

వన్ ప్లస్ చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. వన్ ప్లస్ ప్రకటించిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 చిప్ సెట్ మరియు హసల్ బ్లెడ్ సెకండ్ జెనరేషన్ మొబైల్ కెమెరా వంటి చాలా భారీ ఫీచర్లతో వచ్చింది. ఇంకెందుకు ఆలశ్యం, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి అన్ని విషయాలను తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 10 Pro 5G: ధర

వన్ ప్లస్ 10 ప్రో 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, వాల్కనిక్ బ్లాక్ మరియు ఎమిరాల్డ్ ఫారెస్ట్ అనే రెండు కలర్లలో లభిస్తుంది.  

1. OnePlus 10 Pro 5G :  (8GB + 128GB) – రూ.66,999

2. OnePlus 10 Pro 5G :  (12GB + 256GB) – రూ.71,999

ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా వన్ ప్లస్ ప్రకటించింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 4,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. 

OnePlus 10 Pro-2.jpg    

OnePlus 10 Pro 5G: స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ 10 ప్రో 5జి పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.7 ఇంచ్ LTPO తో Fluid AMOLED డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేయడమే కాకుండా 10బిట్ కాలర్ డెప్త్ తో వస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

కెమెరా విభాగంలో, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు కలిగివుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 48MP SonyIMX789 ప్రధాన కెమెరాకి జతగా OIS సపోర్ట్ కలిగిన 8MP టెలిఫోటో కెమెరా మరియు 50MP (JN1 సెన్సార్) అల్ట్రా వైడ్ కెమెరాని కలిగి వుంటుంది. ఈ కెమెరా (PDAF+LAF+CAF) వంటి మల్టి ఆటో ఫోకస్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరాతో 120fps వద్ద 4K వీడియోను షూట్ చేయవచ్చు. ముందుభాగంలో కూడా EIS సపోర్ట్ కలిగిన 32MP SonyIMX615 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

ఇందులో బయటి మరియు ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రీమియం గానే ఇచ్చింది. ఈ OnePlus 10 Pro 5G లో భారీ 5,000 mAh బ్యాటరీని 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ మరియు 50W AIRVOOC ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo