దీపావళి సందర్భంగా, రెడ్మి K20 ప్రో మరియు రెడ్మి 7S పైన భారీ డిస్కౌంట్లు

దీపావళి సందర్భంగా, రెడ్మి K20 ప్రో మరియు రెడ్మి 7S పైన భారీ డిస్కౌంట్లు
HIGHLIGHTS

రాయితీ ధరతో ఫ్లిప్‌కార్ట్, మి.కామ్‌లో లభిస్తుంది.

2019 దీపావళి కోసం flipkart తీసుకొచ్చినటువంటి, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రెడ్మిK 20 ప్రో స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 30 నుంచి రాయితీ ధరతో ఫ్లిప్‌కార్ట్, మి.కామ్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యాక్సెస్ ఉన్న యూజర్లు సెప్టెంబర్ 29 నుంచి ఈ ఫోన్‌లను సాయంత్రం 8 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. రెడ్మి K 20 ప్రో ధర రూ .24,999, రూ .27,999 నుండి తగ్గగా, రెడ్మి నోట్ 7s పైన రూ .3,000 డిస్కౌంట్‌ అందుకుంటుంది మరియు ఇది కేవలం రూ .8,999 ధరతో అమ్ముడవుతుంది. మీరు HDFC బ్యాంక్ కార్డు తోకొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును మరియు మి.కామ్‌లో EMI ని కూడా పొందవచ్చు.

Redmi K20 Pro  :  ప్రత్యేకతలు

షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.  ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది. 

షావోమి రెడ్మి నోట్ 7S :  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్,  FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 256GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు రూబీ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP + 5MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా SAMSUNG GM1 సెన్సారుతో వస్తుంది మరియు 5MP కెమేరా పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 13MP AI కెమెరాని అందించారు. ఇందులో పోర్ట్రైట్, బొకేహ్ వంటి మరెన్నో ఎంపికలతో సెల్ఫీలను క్లిక్ చెయ్యొచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రక్షణనిస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo